Begin typing your search above and press return to search.
ప్రభాస్ మళ్లీ ఓ ఆల్ ఇండియా రికార్డ్...!
By: Tupaki Desk | 3 Aug 2022 7:32 AM GMTయంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ ఎంత అంటే ఇంత అంటూ అభిమానులు మరోసారి కాలర్ ఎగరేసుకునే డీల్ ఇది. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఆదిపురుష్ సినిమా ఓటీటీ డీల్ ప్రస్తుతం టాక్ ఆఫ్ ది నేషన్ అయ్యింది. ఇప్పటి వరకు ఏ ఇండియన్ సినిమా కూడా దక్కించుకోని పోస్ట్ థియేట్రికల్ ఓటీటీ రైట్స్ ను ఆదిపురుష్ దక్కించుకోవడంతో మరోసారి ఆల్ ఇండియా రికార్డ్ ప్రభాస్ వశం అయ్యింది.
వివరాల్లోకి వెళితే... రామాయణ ఇతివృత్తం తో రూపొందుతున్న ఆదిపురుష్ సినిమాను నెట్ ఫ్లిక్స్ వారు హోల్ సేల్ గా 250 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా ను దర్శకుడు ఓమ్ రౌత్ దాదాపుగా రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిస్తున్నాడట. సినిమా పూర్తిగా మోషన్ గ్రాఫిక్స్ టెక్నాలజీతో రూపొందిస్తున్నట్లు సమాచారం అందుతోంది.
ఒక అద్భుతమైన వరల్డ్ లోకి ప్రేక్షకులను తీసుకు వెళ్తాం అంటూ సినిమాపై దేశ వ్యాప్తంగా ఒక హైప్ ను క్రియేట్ చేయడంలో దర్శకుడు ఓం రౌత్ సక్సెస్ అయ్యాడు. అందుకే ఇప్పటి వరకు కనీసం సినిమా యొక్క ఫస్ట్ లుక్ కూడా విడుదల కాకుండానే సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.
ఆ అంచనాల కారణంగానే ప్రముఖ ఓటీటీ లు ఈ సినిమా పోస్ట్ థియేట్రికల్ రైట్స్ మరియు ప్రీ థియేట్రికల్ రైట్స్ ను కొనుగోలు చేసేందుకు భారీ మొత్తంను ఆఫర్ చేశారు. కాని చివరకు పోస్ట్ థియేట్రికల్ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ రూ.250 కోట్లకు గాను కొనుగోలు చేసినట్లుగా ముంబై వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
కేవలం ఇండియన్ లాంగ్వేజెస్ లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో వివిధ భాషల్లో ఆదిపురుష్ ను స్ట్రీమింగ్ చేసేందుకు గాను పూర్తి డిజిటల్ హక్కులను నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసిందట. కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా లో రావణుడి పాత్రలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమా ఎలా ఉంటుంది అనే ఉత్సుకత ప్రతి ఒక్కరిలో కూడా ఉంది.
ఓటీటీ రైట్స్ ద్వారానే 250 కోట్ల రూపాయలు వస్తే థియేట్రికల్ రైట్స్ ద్వారా మూడు వందల నుండి మూడు వందల యాబై కోట్ల వరకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని ట్రేడ్ వర్గాల వారు అంటున్నారు. సినిమా హిట్ అయ్యి మంచి టాక్ ను దక్కించుకుంటే ఈజీగా వెయ్యి కోట్లు ఈ సినిమా రాబట్టగలదు అని.. అంతే కాకుండా బాహుబలి 2 మరియు దంగల్ సినిమాల యొక్క రికార్డులను బ్రేక్ చేయడం ఖాయం అంటున్నారు.