Begin typing your search above and press return to search.

RRRలో ప్ర‌భాస్ - అనుష్క జోడీ?

By:  Tupaki Desk   |   12 Jun 2019 1:28 PM GMT
RRRలో ప్ర‌భాస్ - అనుష్క జోడీ?
X
తెలుగు సినిమా మార్కెటింగ్ స్ట్రాట‌జీ పూర్తిగా అప్ గ్రేడ్ అయిన సంగ‌తి తెలిసిందే. బాహుబ‌లి స‌క్సెస్ త‌ర్వాత అనూహ్య ప‌రిణామ‌మిది. బ‌హుభాషా న‌టుల్ని ఎంపిక చేసుకుని భారీ కాన్వాసుపై మ‌ల్టీస్టార‌ర్లు తీసి ఇరుగు పొరుగు మార్కెట్ల‌లోనూ క్యాష్ చేసుకునే ఎత్తుగ‌డ వేస్తున్నారు. గ్లోబ‌ల్ మార్కెట్ ని ఛేజిక్కించుకునే దిశాగా టాలీవుడ్ ప‌రుగులు పెడుతోంది.

ఇందులో మ‌రో నూత‌న ఒర‌వ‌డికి RRR శ్రీ‌కారం చుట్ట‌నుందా? అంటే రాజ‌మౌళి ప్లానింగ్ అలానే ఉంద‌ని అర్థ‌మ‌వుతోంది. ఈ సినిమాని తెలుగు- త‌మిళం తో పాటు హిందీలోనూ ప్ర‌తిష్ఠాత్మ‌కంగా రిలీజ్ చేయ‌నున్నారు. అయితే బాలీవుడ్ మార్కెట్ ని ఛేజిక్కించుకోవ‌డం అంటే అదో స‌వాల్ తో కూడుకున్న‌ది. ఎంతో తెలివిగా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. అందుకే అత‌డు ఓ మాస్ట‌ర్ ప్లాన్ వేశార‌ట‌. ఆర్.ఆర్.ఆర్ లోకి ప్ర‌భాస్ - అనుష్క జోడీని అతిధి పాత్ర‌ల‌తో ఆహ్వానించ‌డం ద్వారా మార్కెట్ రేంజ్ పెంచాల‌ని ఆలోచిస్తున్నార‌ట‌. బాహుబ‌లి స్టార్స్ గా ఈ జంట‌కు ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా ఆర్.ఆర్.ఆర్ కి మార్కెట్ ప‌ర‌మైన ఇమేజ్ పెరుగుతుంది. అలాగే ప్ర‌భాస్ కి జ‌పాన్ స‌హా ఎన్నిచోట్ల అభిమానులున్నారో అన్నిచోట్లా ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తారు కాబ‌ట్టి అక్క‌డా మార్కెటింగ్ ప‌రంగా ప్ల‌స్ కానుంది.

ఇక ప్ర‌భాస్ - అనుష్క జంట న‌టిస్తున్నారా లేదా? అన్న‌ది జ‌క్క‌న్న టీమ్ క‌న్ఫామ్ చేయాల్సి ఉంది. మొత్తానికి ఆలోచ‌న సాగుతోంది. ఆర్.ఆర్.ఆర్ కి జాతీయ స్థాయిలో ఆక‌ర్ష‌ణ పెంచ‌డ‌మే ధ్యేయంగా ఎత్తుగ‌డ‌లు వేస్తున్నారు. ఇక సాహో చిత్రంతో ప్ర‌భాస్ పేరు మ‌రోసారి జాతీయ- అంత‌ర్జాతీయ‌ స్థాయిలో మార్మోగ‌నుంది. హిందీ మార్కెట్లోనూ `సాహో` భారీ క్రేజుతో రిలీజ‌వుతోంది. అందుకే ప్ర‌భాస్ వ‌చ్చి చేరితే ఆ కోణంలోనూ ఆర్.ఆర్.ఆర్ కి పెద్ద ప్ల‌స్ అవుతుంద‌న‌డంలో సందేహం లేదు. ప్ర‌స్తుతం ఆర్.ఆర్.ఆర్ చిత్రీక‌ర‌ణ శ‌ర‌వేగంగా పూర్త‌వుతోంది. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ పై స‌న్నివేశాల్ని తెర‌కెక్కిస్తున్నారు. రామ్ చ‌ర‌ణ్ త్వ‌ర‌లోనే సెట్స్ లోకి జాయిన్ కానున్నారు.