Begin typing your search above and press return to search.
ప్రభాస్.. గోపీచంద్.. వాటే సేవ గురూ
By: Tupaki Desk | 29 Aug 2016 4:54 AM GMTసినిమాతారలతో ఒక్క యాడ్ చేయించాలంటే.. లక్షలు కోట్లు కుమ్మరించాల్సిందే. ఇక స్టార్ హీరోల సంగతయితే చెప్పాల్సిన పని లేదు. అడిగినవన్నీ ఫుల్ఫిల్ చేస్తేనే ఆ బ్రాండ్ అండార్స్ మెంట్ డీల్ పై సైన్ చేస్తారు.. లేదా వేరే రూట్లో ప్రచారం చేస్తారు. కానీ టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్.. మాస్ హీరో గోపీచంద్ లు ఉచితంగా ఓ కేంపెయిన్ చేసేస్తున్నారు.
ప్యూర్ హెల్త్ లైఫ్ హెల్త్ సర్వీసెస్ అనే సంస్థ.. వెల్ కేర్ హెల్త్ కార్డ్ పేరుతో ఓ సర్వీస్ ప్రారంభిస్తోంది. దీని ప్రకారం కేవలం 999 రూపాయలే కార్పొరేట్ హాస్పిటల్స్ లో వైద్యం చేయించుకునే సౌలభ్యం అందరికీ లభిస్తుంది. ముఖ్యంగా ఇన్సూరెన్స్ పై పెద్దగా అవగాహన లేని పేదలకు ఇది వరం లాంటిదే. ఈ కాన్సెప్ట్ విపరీతంగా నచ్చేసిన గోపీచంద్.. ఒక్క రూపాయి తీసుకోకుండా దీనికి ప్రచారం చేయనున్నాడు. ఇటు హెల్త్ కార్డ్ కాన్సెప్ట్ తో పాటు.. గోపీచంద్ నిర్ణయం తెలిసిన ప్రభాస్.. ఈ కార్యక్రమాన్ని లాంఛ్ చేసేందుకు ఒప్పుకున్నాడు. అది కూడా పైసా కూడా తీసుకోకుండానే.. ఈ ఈవెంట్ కి హాజరు కాబోతున్నాడు. పేదలకు సాయం చేసే కార్యక్రమానికి ఇద్దరు అగ్ర హీరోలు ఉచితంగా సర్వీస్ చేయడం అభినందించాల్సిన విషయమే. వాటే సేవ గురూ అనాల్సిందే.
ప్రస్తుతం బాహుబలి 2 సినిమా షూటింగ్ లో ప్రభాస్ బిజీగా ఉంటే.. ఆక్సిజన్ సినిమాను ఫినిష్ చేయడంలో గోపిచంద్ బిజీగా ఉన్నాడు. మరో ప్రక్కన ఇలా సోషల్ సర్వీస్ కూడా కానిస్తున్నారు.