Begin typing your search above and press return to search.

ఇట‌లీ అందాల న‌డుమ DDLJ రేంజులో రొమాన్స్

By:  Tupaki Desk   |   18 Sep 2021 3:30 PM GMT
ఇట‌లీ అందాల న‌డుమ DDLJ రేంజులో రొమాన్స్
X
ప్ర‌భాస్-పూజాహెగ్గే జంట‌గా రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో `రాధేశ్యామ్` తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. యూవీ క్రియేష‌న్స్ భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తోంది. పాన్ ఇండియాలో సినిమా రిలీజ్ కాబోతుంది. ఇప్ప‌టికే 1975 కాలం పీరియాడిక్ స్టోరీ ఇది. నాటి కాలాకానికి తీసుకెళ్లే అద్భుత‌మైన సెట్స్ న‌డుమ చిత్రీక‌ర‌ణ జ‌రిపారు. మెజార్టీ పార్ట్ షూటింగ్ అంతా ఇట‌లీ అందాల న‌డుమ జ‌రిగింది. అక్క‌డా ప్రత్యేకంగా కొన్ని అద్భుత‌మైన సెట్లు వేసి తెర‌కెక్కించారంటే? ఇట‌లీ నేప‌థ్యానికి ఎంత ప్రాముఖ్య‌త ఉందో అర్ధ‌మ‌వుతోంది. అన్నింటిని మించి రొమాంటిక్ ల‌వ్ స్టోరీ హైలైట్ కాబోతుంద‌ని ఇప్ప‌టికే క‌థ‌నాలు వేడెక్కిస్తున్నాయి. ఇట‌లీ అందాల న‌డుమ DDLJ రేంజులో రొమాన్స్ కుదిరింద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అసాధార‌ణ ప్రేమ‌కావ్యం `దిల్ వాలే దుల్హానియా లేజాయేంగే` (డీడీఎల్ జే)ని యూర‌ప్ లోని స్విట్జ‌ర్లాండ్ అందాల న‌డుమ తెర‌కెక్కించారు. షారూక్- కాజోల్ ఈ చిత్రంలో జంట‌గా న‌టించిన సంగ‌తి తెలిసిందే.

ఇక రాధేశ్యామ్ కి డీడీఎల్ జే ల‌వ్ ఫీల్ ని రాధాకృష్ణ యాడ్ చేశార‌ని గుస‌గుస‌లు ఇప్పుడు స్ప్రెడ్ అవుతున్నాయి. డార్లింగ్ ప్ర‌భాస్- పూజా హెగ్డే ల మ‌ధ్య 1975 కాలానికి తీసుకెళ్లి...ఆ జంట మ‌ధ్య ఇట‌లీ రొమాంటిక్ స‌న్నివేశాలు చిత్రీక‌రించిన సంగ‌తి తెలిసిందే. ఆ స‌న్నివేశాల కోసం... పాటల చిత్రీక‌ర‌ణ కోస‌మే కోట్లాది రూపాయ‌లు వెచ్చించారు. పాట‌ల చిత్రీక‌ర‌ణ‌లో పూజా హెగ్డే..ప్ర‌భాస్ ధ‌రించిన కాస్ట్యూమ్స్ ని బ‌ట్టి సినిమాలో ల‌వ్ స్టోరీకి ఎంత ప్రాధాన్య‌త ఉందో తెలుస్తోంది. రొమాంటిక్ స‌న్నివేశాల్లో ఎంత మాత్రం ఫీల్ మిస్ కాకుండా ర‌క్తిక‌ట్టేలా వాస్త‌వాన్ని ప్ర‌తిబింబించేలా రియ‌లిస్టిక్ గానే ఆయా స‌న్నివేశాల్లో న‌టించిన‌ట్లు స‌మాచారం. సినిమాలో ఈ స‌న్నివేశాలు ప్ర‌త్యేక ఆక‌ర్ణ‌ణ‌గా నిలుస్తాయ‌ని వినిపిస్తోంది.

ఈ స‌న్నివేశాల్ని కేవ‌లం మేక‌ర్స్.. సినిమాటోగ్రాఫ‌ర్.. ప్ర‌భాస్- పూజాహెగ్డేల మ‌ధ్య‌న మాత్ర‌మే ఓ ప్ర‌యివేటు ప్లేస్ లో షూట్ చేసిన‌ట్లు స‌మాచారం. ఈ నేప‌థ్యంలోనే ఆ స‌న్నివేశాల‌కు అంత ప్రాధాన్య‌త ద‌క్కుతోంద‌ని తెలుస్తోంది. ఇక యాక్ష‌న్ స‌న్నివేశాలు అంతే హైలైట్ కానున్నాయి. సినిమా సెట్స్ కు వెళ్లిన ఆరంభంలో ఇది కేవ‌లం యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ అని ఎక్కువ‌గా ప్ర‌చారం సాగింది. కానీ కాల‌క్ర‌మేణా ఆ స‌న్నివేశాల్ని మించి రొమాంటిక్ ల‌వ్ స్టోరీని ఎక్కువ‌గా హైలైట్ చేస్తున్న‌ట్లు తేలింది. ప్ర‌స్తుతం తుది ద‌శ పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. సీజీ వ‌ర్క్ ఎక్కువ‌గా ఉండ‌టంతో యూనిట్ ముందుగా ఆ ప‌నులు పూర్తి చేసే ప‌నిలో బిజీ అయింది. చిత్రాన్ని జ‌న‌వ‌రి 14న వ‌ర‌ల్డ్ వైడ్ గా రిలీజ్ చేయ‌డానికి ముహూర్తం ఫిక్స్ చేసిన సంగ‌తి తెలిసిందే.

ఆ స‌న్నివేశం సినిమాకే హైలైట్

అత్యంత‌ భారీ కాన్వాస్ పై రాధేశ్యామ్ తెర‌కెక్కుతోంది. 1975 బ్యాక్ డ్రాప్ లో యూర‌ప్ నేప‌థ్యంలో సాగ్ పీరియాడిక్ చిత్ర‌మిది. ఇందులో అంద‌మైన ల‌వ్ స్టోరీని ద‌ర్శ‌కుడు హైలైట్ చేస్తున్నారు. ఓ వైపు భారీ యాక్ష‌న్ సీక్వెన్స్ ని ప‌తాక స్థాయిలో చూపిస్తూనే 1975 కాలానికి తీసుకెళ్లే అద్భుత‌మైన సెట్స్ ని కూడా అంతే హైలైట్ చేస్తున్నారు. చిత్రీక‌ర‌ణ‌లో భాగంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఓ పురాత‌న‌మైన దేవాలయ‌లో ఏకంగా ప‌ది రోజుల పాటు నిర్విరామంగా షూటింగ్ చేసారు. ఇందులో 100 పురోహితులు .. దాదాపు 300 మంది కార్మికులు ప‌నిచేసారుట‌. దేవాల‌యం షూట్ కోసం ఇప్ప‌టివ‌ర‌కూ ఇంత మంది క్రూ ఏ సినిమాకు ప‌నిచేయ‌లేదు. అలాగే ఇన్ని రోజుల పాటు చిత్రీక‌ర‌ణ కూడా జ‌ర‌గ‌లేదు. ఆ ర‌కంగా ఆ స‌న్నివేశాల‌కు ఎంత ప్రాధాన్యత ఉంటుందో అర్ధ‌మ‌వుతోంది. ఇందులో ప్ర‌భాస్..పూజా హెగ్డే స‌హా కీల‌క న‌టులంతా ఈ షూట్ లో పాల్గొన్నారు. పురాత‌న దేవాల‌యంలో షూట్ కి అవ‌స‌ర‌మైన సెట‌ప్ అంతా హైద‌రాబాద్ నుంచి త‌ర‌లించారు.

అంటే ఇక్క‌డ య‌జ్ఞ యాగాలు..క్ర‌తువుల‌కు సంబంధించిన స‌న్నివేశాలు భారీ స్థాయిలో 100 మంది పురోహితుల స‌మ‌క్షంలో షూట్ చేసిన‌ట్లు తెలుస్తోంది. ఈ స‌న్నివేశాలు కూడా సినిమాలో అంతే హైలైట్ కానున్నాయి. అయితే ఏపీలోని ఆ దేవాల‌యం పేరును గానీ..ప్రాంతాన్ని గానీ యూనిట్ ఎక్క‌డా లీక్ చేయ‌లేదు. నేరుగా సినిమాలో చూసి థ్రిల్ ని అందించేలా ప్లాన్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే రాధేశ్యామ్ షూటింగ్ పూర్త‌యింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ `స‌లార్`..`ఆది పురుష్` చిత్రాల షూటింగ్ లో బిజీగా ఉన్నారు.