Begin typing your search above and press return to search.
కనీసం ముఖాలు చూసుకోని ప్రభాస్-పూజాహెగ్డే!
By: Tupaki Desk | 3 March 2022 2:30 PM GMTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్- పూజాహెగ్డే జంటగా నటించిన `రాధేశ్యామ్` ఈనెల 11న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కి రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా యూనిట్ ప్రచారం పనుల్ని ముమ్మరం చేసింది. సినిమాకి వీలైనంత బజ్ తీసుకొచ్చే పనిలో టీమ్ నిమగ్నమైంది.
ఇటీవలే రెండవ ట్రైలర్ ని కూడా ముంబై వేదికగా రిలీజ్ చేసారు. బాలీవుడ్ లో చిత్రాన్ని పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్నారు. దీనిలో భాగంగా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కి ప్రభాస్-పూజాహెగ్డే టీమ్ కీలక సభ్యులంతా హజరయ్యారు. అయితే ట్రైలర్ వేదికపై ఆశ్చర్యకరమైన సంఘటన చోటు చేసుకున్న సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ప్రభాస్-పూజాహెగ్డే ఒకే వేదికపై ఉన్నా ఒకరికి ఒకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకోలేదు. ఆలింగనం చేసుకోలేదు. కరోనా కాబట్టి ఆ రెండు జరగలేదంటే అర్ధం ఉంది. కానీ కనీసం ముఖాలు కూడా చూసుకోని వైనం కనిపించింది. మరి ఇలాంటి సన్నివేశం ఎందుకు చోటు చేసుకున్నది అన్నది తెలియదుగానీ ఈవార్త ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తోంది.
సాధారణంగా హీరో-హీరోయిన్లు ఒకే వేదికపై ప్రమోషన్ కోసం వచ్చినప్పుడు హీరోయిన్ కాస్త తగ్గి ఉంటుంది. కానీ ఇక్కడ అలాంటి సీన్ కనిపించలేదు. హీరోగా కూడా అంతే లైట్ తీసుకున్నారు. మరి ఈ మూతి బిగింపులకు అసలు కారణం ఏంటన్నది తెలియాల్సి ఉంది.
ఇక డార్లింగ్ విషయానికి వస్తే జోవియల్ పర్సన్. అతని ప్రవర్తన ఎలా ఉంటుందన్నది హీరోలు..నిర్మాతలు..అతనితో పనిచేసిన హీరోయిన్లు ఎంతో గొప్పగా చెబుతుంటారు. కానీ పూజా హెగ్డే మాత్రం వాటి జోలికి వెళ్లినట్లు కనిపించలేదు.
అయితే `రాధేశ్యామ్` టీమ్ తో పూజాకి పొసగలేదని మొదటి నుంచి ప్రచారం సాగుతోంది. పూజా హెగ్డే ఇచ్చిన డేట్లలో యూనిట్ షూటింగ్ చేయకపోవడంతో..ఆ తర్వాత ఆమె అదనంగా డేట్లు కేటాయించకపోవడంతో పూజాహెగ్డే కి డూపుని క్రియేట్ చేసి బ్యాలెన్స్ సన్నివేశాలు షూట్ చేసినట్లు మీడియా లో కథనాలొచ్చాయి.
ఆ రకంగా నిర్మాతలు పూజా హెగ్డే పై అసహనంతో ఉన్నట్లు ప్రచారం సాగింది. అలాగే తనతో పనిచేసిన హీరోయిన్లకు ప్రభాస్ ఇంట రుచుల్ని పార్శిల్ చేయడం డార్లింగ్ కి ఓ హాబీ. కానీ పూజా విషయంలో ప్రభాస్ ఇంట పార్శిల్ కహానీలు కూడా వెలుగులోకి రాలేదు.
తాజాగా ప్రభాస్ తో చోటు చేసుకున్న సన్నివేశం నేపథ్యంలో ఇవన్నీ నిజమేనా? అన్న సందేహాలు మరింత బలపడుతుపన్నాయి. మరి వీటిలో నిజా నిజాలు? ఏంటన్నది తెలియాల్సి ఉంది.