Begin typing your search above and press return to search.
కట్టప్ప లేనిదే ప్రభాస్ లేడు! తంబీలు వింటున్నారా?
By: Tupaki Desk | 6 March 2022 5:30 AM GMTకొందరు స్టార్లతో సినిమాకి గ్రిప్ పెరుగుతుంది. స్టార్ హీరోతో కాంబినేషన్ గా ఇతర స్టార్లు కూడా చాలా కీలకం. బాహుబలి ఫ్రాంఛైజీకి కట్టప్ప ఎంత ఇంపార్టెంట్ గా మారాడో తెలిసినదే. అయితే సత్యరాజ్ కి కట్టప్ప ఆఫర్ ఎలా వచ్చింది? అంటే అంతకుముందు నుంచి కూడా సత్యరాజ్ కి ప్రభాస్ తో ఉన్న అనుబంధం అలాంటిది.
మిర్చి సినిమా మొదలు ఈ అనుబంధం అలా కొనసాగుతూనే ఉంది. ప్రభాస్ నటించే ప్రతి సినిమాలో సత్యరాజ్ కనిపిస్తున్నారు. అలాగే ప్రభాస్ స్నేహితులు యువి బ్యానర్ లో అతడు ఒక భాగంగా మారిపోయారు. ఆ బ్యానర్ సినిమాలన్నిటికీ ఆయన ఓకే చెప్పేస్తున్నారు.
సరిగ్గా ఈ అనుబంధంతోనే రాధేశ్యామ్ చిత్రంలో కామియో రోల్ ఆఫర్ చేసినా అంత పెద్ద స్టార్ సత్యరాజ్ అంగీకరించారట. ఆ విషయాన్ని తానే స్వయంగా వెల్లడించారు. నిజానికి కామియోల్లో నేను నటించను.. కానీ డార్లింగ్ ప్రభాస్ కోసం అంగీకరించాను. రాధేశ్యామ్ లో నా పాత్ర కీలకమైన పాయింట్ తో ఉంటుంది. కథను నడిపించే పాత్రగా కనిపిస్తుంది అని కూడా వెల్లడించారు.
ఇదిలా ఉంటే తమిళనాడులో రాధేశ్యామ్ ప్రమోషనల్ ఈవెంట్ లో కట్టప్పతో ప్రత్యక్షమైన ప్రభాస్.. నిజంగానే సత్యరాజ్ తో తనకు ఉన్న అనుబందం గురించి వెల్లడించాడు. మిర్చి సమయం నుంచి తనతో కలిసి పని చేస్తున్నానని వెల్లడించారు. సత్యరాజ్ సర్ అని ప్రస్థావిస్తూ వేదికపై ఉన్న ఇతర టెక్నీషియన్లందరినీ సర్ అని గ్రౌండ్ టు ఎర్త్ పిలుస్తూ డార్లింగ్ అందరినీ ఆకట్టుకున్నారు. సరదా సరదాగా మాట్లాడేస్తూ పాన్ ఇండియా స్టార్ ఎంతో జోవియల్ గానూ కనిపించారు.
సత్యరాజ్ సార్ నా లక్కీ మస్కట్ అని వేదికపై ప్రభాస్ అన్నారు
ఇక ఈ ఈవెంట్లో సత్యరాజ్ తో కలిసి పనిచేసిన రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయని ప్రాస్ అన్నారు. రాధే శ్యామ్ కూడా తమ ఇద్దరి కెరీర్ లో మైలురాయిగా నిలిచిపోతుందని అన్నారు. సత్యరాజ్ సార్ నా లక్కీ మస్కట్. నేను ఆయనతో కలిసి మిర్చి సినిమాకి పని చేసాను.
అది సూపర్ హిట్ అయ్యి ఆ తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ అయిన బాహుబలి లో పనిచేశాను. రాధే శ్యామ్ మా ఇద్దరికీ మరో మైలురాయిగా నిలిచిపోతుందన్న నమ్మకం ఉంది. ఈ సినిమాలో అతని క్యారెక్టరైజేషన్ చాలా పవర్ ఫుల్ గా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అని ప్రభాస్ అన్నారు.
1970ల నాటి నేపథ్యంలో సాగే `రాధే శ్యామ్`లో ప్రభాస్ హస్తసాముద్రిక నిపుణుడిగా నటిస్తున్నాడు. ఇటలీ- జార్జియా- హైదరాబాద్ లోని అరుదైన లొకేషన్లలో తెరకెక్కింది. అత్యుత్తమ సాంకేతిక అంశాలు మరియు అద్భుతమైన విజువల్స్ తో కూడిన ఈ చిత్రానికి అమితాబ్ బచ్చన్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. రాధాకృష్ణ దర్శకత్వం వహించారు.
ఇందులో పూజాహెగ్డే కథానాయిక. రెడ్ జెయింట్ మూవీస్ సమర్పణలో యువి క్రియేషన్స్ నిర్మించింది. సత్యరాజ్ సహా జగపతి బాబు- భాగ్యశ్రీ లాంటి సీనియర్లు ఇందులో నటించారు. మార్చి 11న ఈ చిత్రం విడుదలవుతోంది. కట్టప్ప లేనిదే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లేడు! తంబీలు వింటున్నారా? అంతగా తెలుగు వాళ్లు తంబీలతో అనుబంధం పెంచుకున్నారు. అంతగా డార్లింగ్ సత్యరాజ్ పై అభిమానం కురిపించారు. కానీ తెలుగు వాళ్ల సినిమాల్ని ఆదరించేందుకు ప్రాంతీయ భాషా విభేధాల్ని చూస్తారు.. నేటివిటీ అంటారు దేనికి?