Begin typing your search above and press return to search.
మూడు బాషల్లో ప్రభాస్ 'సాహో'
By: Tupaki Desk | 2 April 2017 6:14 AM GMTఇక ఏప్రియల్ 28న ''బాహుబలి 2'' రిలీజ్ అయిపోయిందంటే.. కండలవీరుడు ప్రభాస్ పూర్తిగా ఆ టింట్ నుండి బయటకు వచ్చేసినట్లే. అయితే ప్రభాస్ ఆల్రెడీ బయటకు వచ్చేశాడని మారిపోయిన తన హెయిర్ స్టయిల్ చూస్తే మనకు అర్ధమైపోతోందిగా. ఇప్పుడు తన తదుపరి సినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది.
నిజానికి కొత్త కుర్రాడు సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ కొత్త సినిమాను ఆల్రెడీ మొదలెట్టేశాడు. ఈ సినిమా తాలూకు టీజర్ ను బాహుబలి 2 సినిమాతో పాటు రిలీజ్ చేస్తారని టాక్ ఉంది. అయితే ఈ సినిమాను ఒకేసారి తెలుగు, తమిళ్, హిందీ బాషల్లో రూపొందించడమే ప్లాన్. అలాంటప్పుడు సినిమా టైటిల్ ఏమని పెట్టాలి? బాహుబలి తరహాలో మూడు బాషల్లో ఒకే టైటిల్ అయితే బెటర్ అని అంచనాలకు వచ్చేసి ఒక టైటిల్ పిక్ చేశారు. ''సాహో'' అనే పేరు బాహుబలిలోని సాంగుతో బాగా పాపులర్ అయ్యింది. అందుకే ఇప్పుడు ''సాహో'' అనే టైటిల్ యువి క్రియేషన్స్ వారు రిజిష్టర్ చేశారు.
సాహో సినిమాతో.. ప్రభాస్ బాహుబలి ద్వారా ఎంత క్రేజ్ సంపాదించుకున్నాడో.. అంత పేరును నిలబెట్టుకోవాల్సి ఉంది. మరి చూద్దాం ఈ సాహో ఎలా ఉండోబోతోందో.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/