Begin typing your search above and press return to search.
2017 టాప్ ఇండియన్ స్టార్స్ లో ప్రభాస్
By: Tupaki Desk | 8 Dec 2017 8:33 AM GMTఈ ఏడాది టాలీవుడ్ కి చాలా ప్రత్యేకమైనది అని చెప్పాలి. కొంచెం కొంచెంగా మార్కెట్ పెరుగుతున్న సమయంలో ఒక్కసారిగా బాహుబలితో బూస్ట్ ఇచ్చి ఒక తెలుగు సినిమాని ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై టాప్ లో నిలబెట్టారు రాజమౌళి. ఆ సినిమాతో నార్త్ లో ఉండే సినీ జనాలు చూపు చాలా వరకు టాలీవుడ్ వైపు మళ్లిందనే చెప్పాలి. ముఖ్యంగా హీరో ప్రభాస్ కి ఎనలేని గుర్తింపు దక్కింది. తన కెరీర్ లో ఒకే సారి అన్ని రికార్డులను ప్రభాస్ సొంతం చేసుకున్నాడు.
అసలైన బాక్స్ ఆఫీస్ సినిమాలో నటించి ఇండియన్ టాప్ స్టార్స్ లో ఒకడిగా చేరిపోయాడు. ఇది అందరికి తెలిసిన విషయమే అయినా ఆదరపూర్వకంగా వెలువడలేదు. సినిమాను అయితే అందరు ఇష్టపడ్డారు. మరి ప్రభాస్ ని ఎంత మంది లైక్ చేశారు. అనే విషయానికొస్తే టాప్ ఇండియన్ స్టార్స్ లో మనోడు 6వ స్థానాన్ని దక్కించుకోవడం చాలా గొప్పే అని చెప్పాలి. ఇటీవల ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ (IMDb) రిలీజ్ చేసిన టాప్ స్టార్స్ ఆఫ్ ఇండియన్ సినిమా 2017 లిస్ట్ లో ఒక తెలుగు హీరో మొదటి సారి స్థానాన్ని అందుకున్నాడు.
IMDb యూజర్స్ రేటింగ్స్ హార్ట్స్ ని గెలుచుకున్న వారిలో ప్రభాస్ ఆరవ స్థానాన్ని అందుకోగా హీరోయిన్స్ లలో మిల్కి బ్యూటీ తమన్నా భాటియా 4వ స్థానంలో నిలిచింది. ఇక బాహుబలి హీరోయిన్ దేవసేన అనుష్క షెట్టి కూడా చాలా మంది హృదయాలను గెలిచింది. ఆమెకు 7వ స్థానం దక్కింది. మొదటి మూడు స్థానాలను ఖాన్ త్రయం దక్కించుకుంది. షారుక్ - అమీర్ - సల్మాన్ ముగ్గురు వరుసగా ర్యాంకులను అందుకున్నారు.