Begin typing your search above and press return to search.

ప్రభాస్‌ అనుష్క.. మరో ఆసక్తికర పుకారు

By:  Tupaki Desk   |   3 May 2022 12:30 PM GMT
ప్రభాస్‌ అనుష్క.. మరో ఆసక్తికర పుకారు
X
ప్రభాస్‌ మరియు అనుష్క ప్రేమించుకుంటున్నారు... ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ దాదాపు రెండు మూడు సంవత్సరాల పాటు రెగ్యులర్‌ గా వార్తలు వచ్చాయి. మీడియాలో వార్తలు రాసిన వారికి విసుగు వచ్చి మానుకున్నారు కాని వారు ప్రేమించుకున్నది లేదు.. పెళ్లి చేసుకున్నది అంతకంటే లేదు. ఇద్దరి మద్య మంచి స్నేహం ఉందని అందరికి అర్థం అయ్యింది.

బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ తో పాటు అనుష్క కూడా పాన్‌ ఇండియా స్టార్‌ హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకుంది. ఆమె చేయాలనుకుంటే ఆ సమయంలో బాలీవుడ్‌ సినిమాల్లో నటించే అవకాశం ఉంది.. వరుసగా అయిదు పది తెలుగు.. తమిళ సినిమాలు చేసే అవకాశాలు కూడా వచ్చి ఉంటాయి. కాని ఆమె మాత్రం ఆసక్తి చూపించలేదు. బాహుబలి 2 విడుదల తర్వాత ఆమె ఇప్పటి వరకు కేవలం రెండు సినిమా లను మాత్రమే ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చింది.

ప్రస్తుతం యూవీ క్రియేషన్స్ బ్యానర్‌ లో మహేష్ పి దర్శకత్వంలో ఒక సినిమా ను చేస్తోంది. ఆ సినిమా లో జాతిరత్నాలు ఫేం నవీన్ పొలిశెట్టి కీలక పాత్రలో నటించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆ సినిమా కాకుండా అనుష్క మరో సినిమాకు కూడా ఓకే చెప్పిందనే వార్తలు వస్తున్నాయి. అదే ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో దానయ్య నిర్మించబోతున్న రాజా డీలక్స్ చిత్రం.

గత మూడు నాలుగు నెలలుగా ప్రభాస్‌.. మారుతి కాంబోలో రాజా డీలక్స్ సినిమా గురించిన పుకార్లు షికార్లు చేస్తున్నాయి. రాధేశ్యామ్‌ సినిమా సక్సెస్ అయ్యి ఉంటే వెంటనే ప్రకటన వచ్చి ఉండేది. కాని ఆ సినిమా నిరాశ పరచడం రాజా డీలక్స్ విషయంలో కాస్త వెనకడుగు వేశారు. సినిమా కాస్త ఆలస్యం అయినా అతి త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.

రాజా డీలక్స్ కథానుసారంగా ప్రభాస్ తో ముగ్గురు హీరోయిన్స్ నటించాల్సి ఉందట. ఇప్పటికే దానయ్య ముగ్గురు హీరోయిన్స్ లో ఇద్దరు హీరోయిన్స్ గా పెళ్లిసందడి ఫేమ్‌ శ్రీలీలా మరియు తమిళ విజయ్‌ మాస్టర్ ఫేం మాళవిక మోహనన్‌ కు అడ్వాన్స్ ఇచ్చేశాడట. ఇక మరో హీరోయిన్‌ గా అనుష్క ను ఎంపిక చేసే విషయమై చర్చలు జరుపుతున్నారని మీడియా వర్గాల ద్వారా తెలుస్తోంది.

అనుష్క సినిమాలో మెయిన్‌ హీరోయిన్‌ గా కనిపించబోతుందని.. ప్రభాస్ మరియు అనుష్క ల మద్య రొమాంటిక్ సన్నివేశాలు కాకుండా మంచి స్నేహ సంబంధ సన్నివేశాలు ఉంటాయని కూడా ప్రచారం జరుగుతోంది. ఇద్దరి మద్య రొమాన్స్ లేకున్నా ఇద్దరు కలిసి నటిస్తే చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరి ఈ పుకారు ఎంత వరకు నిజం అనేది తెలియాలంటే మరి కొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే.