Begin typing your search above and press return to search.

`ప్ర‌భాస్ - అనుష్క` రొమాన్స్ రిపీటైందా?

By:  Tupaki Desk   |   30 Nov 2021 4:10 AM GMT
`ప్ర‌భాస్ - అనుష్క` రొమాన్స్ రిపీటైందా?
X
డార్లింగ్ ప్ర‌భాస్ - అనుష్క జంట ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో న‌టించిన సంగ‌తి తెలిసిందే. బిల్లా- మిర్చి- బాహుబ‌లి లాంటి చిత్రాల్లో న‌టించి హాట్ పెయిర్ గా అభిమానుల గుండెల్లో నిలిచారు. ఇక అనుష్క‌తో ప్రభాస్ రొమాన్స్ గురించి అభిమానులు ఆస‌క్తిగా మాట్లాడుకుంటారు. ఆ ఇద్ద‌రి మ‌ధ్యా కెమిస్ట్రీ తెర‌పై ఒక రేంజులో పండుతుంద‌న్న గుస‌గుస ఉంది. ఆఫ్ ద స్క్రీన్ కూడా ఆ ఇద్ద‌రూ ప్రేమికులు అన్న ప్ర‌చారం ఉన్నా.. దానిని ప‌లుమార్లు ఈ జంట ఖండించింది. ప్ర‌భాస్ - అనుష్క జోడీ చాలా కాలంగా త‌మ మధ్య‌ గొప్ప‌ స్నేహానుబంధాన్ని కొన‌సాగిస్తున్నామ‌ని తెలిపారు.

`ప్ర‌భాస్` ప్రస్తుతం `రాధేశ్యామ్` చిత్రంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. డిసెంబర్ 1న విడుదల కానున్న `ఆషికి ఆ గయీ` హిందీ ఫస్ట్ సింగిల్ ప్రోమోని మేకర్స్ ఆవిష్కరించారు. అభిమానులు ఇప్పుడు హిందీ సింగిల్ గ్లింప్స్ నుండి అనుష్క శెట్టితో ఓ రిలేష‌న్ ని క‌నిపెట్ట‌డం ఆశ్చ‌ర్య‌క‌రం. అది ఏమై ఉంటుంది? అంటే.. ప్రభాస్ - పూజా హెగ్డేల ఫోజ్ ఒక‌టి అచ్చం `మిర్చి` నుంచి స్ఫూర్తి పొందిన‌ట్టుగా క‌నిపిస్తోంది.

`మిర్చి`లో అనుష్క‌తో ప్ర‌భాస్ రొమాన్స్ ని ప్ర‌తిబింబించే ఒక ఇమేజ్ ని అభిమానులు క‌నుగొన్నారు. మిర్చి నుండి ఒక అభిమాని తీసిన స్టిల్ ఇప్పుడు ప్రభాస్ -అనుష్క అభిమానుల దృష్టిని ఆకర్షించింది. రెండు జంట‌ల్లో ఒక‌రే హీరో... కానీ హీరోయిన్ మారింది! అంటూ అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. అలాగే అనుష్క‌తో క‌లిసి ప్ర‌భాస్ మ‌ళ్లీ న‌టించాల‌ని కూడా అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. అనుష్క -ప్రభాస్ జంట‌పై ర‌క‌ర‌కాల పుకార్లు ఉన్నా.. ఆ ఇద్ద‌రూ కేవ‌లం స్నేహితులం మాత్ర‌మేన‌ని వెల్ల‌డించారు. ఇటీవ‌లి కాలంలో ఈ జంట క‌లిసి న‌టించే అవ‌కాశం రాలేదు. అనుష్క త‌దుప‌రి యువి క్రియేష‌న్స్ చిత్రంలో న‌టించ‌నున్న సంగ‌తి తెలిసిందే. పీరియడ్ ల‌వ్ డ్రామా `రాధే శ్యామ్` జనవరి 14న సంక్రాంతి కానుక‌గా విడుద‌ల‌వుతున్న సంగ‌తి తెలిసిందే.