Begin typing your search above and press return to search.

హైకోర్టును ఆశ్రయించిన ప్రభాస్

By:  Tupaki Desk   |   19 Dec 2018 7:35 AM GMT
హైకోర్టును ఆశ్రయించిన ప్రభాస్
X
హైదరాబాద్ శివారులోని రాయదుర్గం పరిధిలో సర్వేనంబర్ 46లోని స్థలం ప్రభుత్వ స్థలంగా గుర్తిస్తూ సుప్రీం కోర్టు ఇటీవల తీర్పునిచ్చింది. దీంతో అధికారులు ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ స్థలంలోనే ఉన్న టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ కు చెందిన గెస్ట్ హౌస్ ను కూడా శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారులు సోమవారం సీజ్ చేశారు.

ఈ భూమి పత్రాలు తన వద్ద ఉన్నాయని.. కొందరు ప్రైవేటు వ్యక్తులు ఈ స్థలాన్ని తనకు అమ్మారని హీరో ప్రభాస్ ఈరోజు హైకోర్టును ఆశ్రయించారు. ఈ స్థలాన్ని వదులుకునేది లేదని.. అధికారులు కనీసం నోటీసు ఇవ్వకుండా ఎలా సీజ్ చేస్తారని.. దీనిపై న్యాయపోరాటానికి ప్రభాస్ సిద్ధమయ్యారు.

ప్రభాస్ కు ఇక్కడ 2200 గజాల స్థలం ఉంది. అందులో ఎంతో ఇష్టపడి గెస్ట్ హౌస్ ను నిర్మించుకున్నారు. మొత్తం 84.30 ఎకరాలు ప్రభుత్వ స్థలంగా సుప్రీంకోర్టు గుర్తించింది. ఇందులో ప్రభాస్ స్థలం కూడా ఉండడంతో సీజ్ చేశారు.

ఈ స్థలంపై ప్రభుత్వానికి.. ప్రైవేటు వ్యక్తులకు సుప్రీం కోర్టులో కొన్నేళ్లుగా వివాదం నడుస్తోంది. ప్రభుత్వం ఈ స్థలం తమదేనని స్వాధీనం చేసుకోవడంతో ప్రైవేటు వ్యక్తులు హైకోర్టుకు, సుప్రీంకు వెళ్లారు. ఈ స్థలం ప్రభుత్వ స్వాధీనంపై స్టే ఇచ్చింది. అయితే శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారులు కోర్టుకు వెళ్లి స్థలంపై స్టే ఎత్తివేయించారు. సుప్రీం కోర్టు కూడా ప్రభుత్వ స్థలంగా తీర్పునిచ్చింది. ఎన్నికల కోడ్ ఉండడంతో మూడు నెలలు చర్యలకు దిగలేదు. ఇప్పుడు ఆస్థలంలో అక్రమ నిర్మాణాలు కూల్చి ప్రభాస్ గెస్ట్ హౌస్ ను సీజ్ చేశారు.