Begin typing your search above and press return to search.

గోపీచంద్‌ ఇంటికి లంబోర్ఘినిలో ప్రభాస్‌

By:  Tupaki Desk   |   4 Aug 2022 9:30 AM GMT
గోపీచంద్‌ ఇంటికి లంబోర్ఘినిలో ప్రభాస్‌
X
యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇదే సమయంలో ఆయన ఏదో ఒక సినిమా కార్యక్రమంలో పాల్గొంటూ కనిపిస్తున్నారు. మొన్నటి వరకు విదేశాలకు వెళ్లిన ప్రభాస్ వచ్చి రాగానే సీతారామం సినిమా యొక్క ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ లో పాల్గొన్నాడు. నిర్మాతల విజ్ఞప్తి మేరకు ప్రభాస్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ లో పాల్గొన్నాడు. అంతకు ముందు ప్రభాస్ స్వయంగా తన కారులో గోపీచంద్‌ ఇంటికి వెళ్లాడట.

ప్రభాస్‌ మరియు గోపీచంద్ లు మంచి స్నేహితులు అనే విషయం తెల్సిందే. ఇద్దరు కూడా గతంలో కలిసి నటించారు. ఆ మధ్య పక్కా కమర్షియల్‌ సినిమా ప్రమోషన్‌ లో ప్రభాస్ కనిపించాల్సి ఉంది.

ఆ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాల్లో భాగంగా గోపీచంద్ మాట్లాడుతూ మరోసారి ప్రభాస్‌ తో నటించేందుకు వెయిట్‌ చేస్తున్నాను.. ఎలాంటి పాత్రను అయిన చేసేందుకు ఓకే అన్నట్లుగా వెయిట్‌ చేస్తున్నాను అన్నాడు.

అలాంటి స్నేహం ఇద్దరి మధ్య ఉంది. కేవలం స్నేహం వరకు మాత్రమే కాకుండా గోపీచంద్ కు ఎలాంటి సమయంలో అయినా అండగా ఉండే వ్యక్తి ప్రభాస్ అంటూ ఇండస్ట్రీలో టాక్.

గోపీచంద్ తనయుడు వియాన్ అంటే ప్రభాస్ కు అమితమైన ప్రేమ గా సమాచారం. ఆ అభిమానంతోనే గోపీచంద్‌ ఇంటికి అప్పుడప్పుడు వియాన్ ను చూసేందుకు ప్రభాస్‌ వెళ్తూ ఉన్నాడట.

తాజాగా కూడా ప్రభాస్‌ ఖరీదైన లంబోర్ఘిని కారు గోపీచంద్‌ ఇంటి ముందు కనిపించడంతో మరోసారి ప్రభాస్ వచ్చాడని స్థానికులు అన్నారు. ప్రభాస్‌ స్వయంగా గోపీచంద్‌ ఇంటికి వెళ్లడం ఇదే ప్రథమం కాదని అక్కడి వారు అంటున్నారు. స్నేహం కోసం గోపీచంద్‌ ఇంటికి పలు సార్లు వెళ్లిన ప్రభాస్‌ మంచి మనసును అర్థం చేసుకోవచ్చు. ఆయన మంచితనం కు ఇది ఒక నిదర్శనం మాత్రమే..!