Begin typing your search above and press return to search.
మదురైలో బాహుబలి మేనియా
By: Tupaki Desk | 18 Jan 2018 12:14 PM GMTఅదేంటి బాహుబలి 2 వచ్చి ఎనిమిది నెలలు దాటింది కదా ఇంకా మేనియా ఏంటి అని అనుకుంటున్నారా. టీవీలో టెలికాస్ట్ అయినా కూడా దీని మీద జనంలో క్రేజ్ తగ్గలేదు అని చెప్పడానికి ఎక్కడో ఒక చోట ఏదో ఒక ప్రదర్శనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా తమిళనాడు మదురై పట్టణంలో మదురై ఎంటర్టైన్మెంట్ అనే సంస్థ స్థానిక తముక్కం గ్రౌండ్స్ లో భారీ స్థాయిలో బాహుబలి మ్యూజియం ఒకటి ఏర్పాటు చేసింది. అందులో సినిమాలో ఉన్న ముఖ్యమైన ఘట్టాలు, పాత్రలు అన్నింటిని విగ్రహాల రూపంలో ప్రతిష్టించి ప్రదర్శన ఏర్పాటు చేసారు. ఇంకేముంది జనం తండోప తండాలుగా చూడడానికి వచ్చేస్తున్నారు. ఇలాంటి అవకాశం వదులుకుంటారా. విగ్రహాల దగ్గర సెల్ఫీలతో నానా రచ్చ చేస్తున్నారు.
ఊహించిన దాని కంటే భారీ రెస్పాన్స్ రావడం పట్ల నిర్వాహకులు కూడా సంతోషంగా ఉన్నారు. కట్టప్ప గుండు మీద అమరేంద్ర బాహుబలి కాలు పెట్టడం, భారీ దున్నపోతుతో భల్లాల దేవా ఫైట్ చేయటం, దేవసేన-శివగామి విగ్రహాలు ఇలా ఒకటేమిటి చాలా విశేషాలతో భలే కనువిందుగా ఉందట ఆ మ్యూజియం. ప్రాంతీయాభిమానం ఎక్కువగా ఉండే తమిళనాడు లో ఒక తెలుగు డబ్బింగ్ సినిమాను ఈ విధంగా హృదయానికి తీసుకోవడం అభినందించదగ్గ విషయమే. దీనికి పూర్తి క్రెడిట్ రాజమౌళికే దక్కినా ఆ పాత్రలను పండించడంలో నటీనటులు చేసిన కృషి కూడా తక్కువేమీ కాదు.
బాహుబలి 2 విడుదలైనప్పటి నుంచి ఏదో విధంగా వార్తల్లో ఇప్పటి దాకా నానుతూనే ఉంది. రెండు నెలల క్రితం యు ట్యూబ్ లో అఫీషియల్ గా బాహుబలి 2 ని అప్ లోడ్ చేసాక ఇప్పుటి దాకా 80 మిలియన్ వ్యూస్ తెచ్చుకుంది. మరో 20 మిలియన్లు వచ్చాయంటే 100 మిలియన్ వ్యూస్ తెచ్చుకున్న తొలి పూర్తి నిడివి తెలుగు సినిమాగా కూడా బాహుబలి 2 కొత్త రికార్డు సృష్టిస్తుంది. అదేమి అసాధ్యం కాదు లేండి. ఓ నెలలో సాధించేలా ఉంది.