Begin typing your search above and press return to search.

పిక్‌ టాక్‌ : ప్రభాస్‌ టాప్‌ టు బాటమ్‌ బ్లాక్‌

By:  Tupaki Desk   |   5 July 2019 9:14 AM GMT
పిక్‌ టాక్‌ : ప్రభాస్‌ టాప్‌ టు బాటమ్‌ బ్లాక్‌
X
బాహుబలి' స్టార్‌ ప్రభాస్‌ త్వరలో సాహో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. రెండేళ్లుగా 'సాహో' కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ రెండేళ్లలో ప్రభాస్‌ బయట కనిపించింది చాలా తక్కువ అని చెప్పాలి. ఒక వేళ కనిపించినా కూడా అది ఎయిర్‌ పోర్ట్‌ లోనే. తాజాగా మరోసారి ప్రభాస్‌ ఎయిర్‌ పోర్ట్‌ లో కనిపించాడు. ఆస్ట్రేలియాలో పాట చిత్రీకరణ కోసం వెళ్లిన సాహో టీం దాన్ని పూర్తి చేసుకుని ఇండియా చేరుకుంది.

ప్రభాస్‌ ఎయిర్‌ పోర్ట్‌ లో బ్లాక్‌ అండ్‌ బ్లాక్‌ లో కనిపించాడు. బ్లాక్‌ క్యాప్‌ పెట్టుకుని బ్లాక్‌ షర్ట్‌ మరియు బ్లాక్‌ పాయింట్‌ వేసుకున్నాడు. తన బ్లాక్‌ బ్యాగ్‌ ను స్వయంగా తానే బుజాలకు వేసుకుని ఎయిర్‌ పోర్ట్‌ నుండి బయటకు వచ్చాడు. బ్లాక్‌ అండ్‌ బ్లాక్‌ ధరించిన ప్రభాస్‌ వైట్‌ షూష్‌ ను ధరించాడు. ప్రభాస్‌ మాస్‌ లుక్‌ అందరిని ఆకట్టుకుంటుంది. గడ్డం మరియు మీసాలు లైట్‌ గా కనిపిస్తూ ప్రభాస్‌ ఈ లుక్‌ లో అదిరి పోయాడంటూ ఫ్యాన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.

'సాహో' చిత్రంలో ప్రభాస్‌ లుక్‌ ఇప్పటికే రివీల్‌ అయ్యింది. టీజర్‌ మరియు పోస్టర్స్‌ తో సినిమాలో ప్రభాస్‌ ఎలా కనిపించబోతున్నాడనే ఒక అంచనాకు వచ్చాం. బాహుబలి లుక్‌ కు సాహో లుక్‌ కు చాలా డిఫరెన్స్‌ ఉండబోతుంది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న 'సాహో' చిత్రం దేశ వ్యాప్తంగా భారీ వసూళ్లను నమోదు చేస్తుందనే నమ్మకంతో సినీ వర్గాల వారు ఉన్నారు.