Begin typing your search above and press return to search.

పాన్ ఇండియా స్టార్ బర్త్ డే సీడీపీ తో సెలబ్రేషన్స్ స్టార్ట్ చేసిన డై హార్డ్ ఫ్యాన్స్!

By:  Tupaki Desk   |   20 Oct 2020 6:19 PM GMT
పాన్ ఇండియా స్టార్ బర్త్ డే సీడీపీ తో సెలబ్రేషన్స్ స్టార్ట్ చేసిన డై హార్డ్ ఫ్యాన్స్!
X
అభిమాన హీరోల పుట్టిన రోజు వచ్చిందంటే ఫ్యాన్స్ చేసే హంగామా ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పెద్ద పెద్ద కటౌట్లు.. బ్యానర్లు.. ప్లెక్సీలు.. కేక్ కటింగులు అంటూ మామూలు హడావిడి ఉండదు. అయితే టెక్నాలజీ అందరికి అందుబాటులోకి వచ్చిన తర్వాత సెలబ్రిటీల బర్త్ డే నాడు సోషల్ మీడియా వేదికగా సెలబ్రేషన్స్ చేయడం ట్రెండ్ గా మారింది. తమ అభిమాన హీరో పుట్టినరోజుకి ఓ కామన్ డిస్ప్లే (సీడీపీ) ని డిజైన్ చేసి.. ట్విట్టర్ లో ఓ హ్యాష్ ట్యాగ్ తో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 23న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు కావడంతో ఆయన బర్త్ డే సీడీపీ ని రిలీజ్ చేశారు.

ఈ బర్త్ డే కామన్ డీపీ లో అశేషమైన అభిమానుల మధ్య పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ ఉండేలా డిజైన్ చేశారు. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ కీర్తిని చాటిచెప్పేలా చైనా - జపాన్ - నార్త్ ఇండియా నుంచి కూడా ప్రేమను పొందుతున్నట్లు చూపించే ప్రయత్నం చేశారని తెలుస్తోంది. ఇందులో 'సాహో' సినిమాలోని ప్రభాస్ ఫోటోని ఉపయోగిస్తూ 'ఇండియన్ సినిమా' అనే టైటిల్ ని మధ్యలో ఉంచారు. అలానే ఒకవైపు 'బాహుబలి' సీన్.. మరోవైపు 'స్టార్' సింబల్ కనిపిస్తున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రభాస్ బర్త్ డే కామన్ డీపీ వైరల్ అవుతోంది.

ఇదలావుండగా డార్లింగ్ ప్రభాస్ పుట్టినరోజు కానుకగా ప్రస్తుతం ఆయన నటిస్తున్న ''రాధే శ్యామ్'' చిత్రం నుంచి 'బీట్స్ ఆఫ్ రాధే శ్యామ్' పేరుతో మోషన్ పోస్టర్ విడుదల చేయనున్నారు. 'జిల్‌' ఫేమ్‌ రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణా మూవీస్‌ మరియు యూవీ క్రియేషన్స్‌ బ్యానర్స్ పై వంశీ - ప్రమోద్‌ - ప్రశీద నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కుతున్న ఈ పీరియాడికల్‌ లవ్‌ డ్రామాలో పూజా హెగ్డే హీరోయిన్‌ గా నటిస్తోంది. దీంతో పాటు ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కనున్న 'ఆదిపురుష్' నుంచి ఏదైనా అప్డేట్ వస్తుందని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.