Begin typing your search above and press return to search.

ప్ర‌భాస్ బ‌ర్త్ డే స‌ర్ ప్రైజ్ వ‌చ్చేస్తోంది!

By:  Tupaki Desk   |   19 Oct 2022 10:30 AM GMT
ప్ర‌భాస్ బ‌ర్త్ డే స‌ర్ ప్రైజ్ వ‌చ్చేస్తోంది!
X
పాన్ ఇండియా స్టార్ ప్ర‌న‌భాస్ బ‌ర్త్ డే వేడుక‌లు పాన్ ఇండియా వైడ్ గా అభిమానులు జ‌రుపుకోవ‌డానికి రెడీ అవుతున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మ‌రో నాలుగు రోజుల్లో పుట్టిన రోజు వేడుక‌లు భారీ స్థాయిలో జ‌ర‌గ‌నున్న వేళ భారీ ఏర్పాట్లు చేసుకుంటున్న ఫ్యాన్స్ ప్ర‌భాస్ నుంచి స‌ర్ ప్రైజ్ ల‌ని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. ఇప్ప‌టికే ప్ర‌భాస్ న‌టించిన తొలి మైథ‌లాజిక‌ల్ డ్రామా 'ఆదిపురుష్‌' టీజ‌ర్ రిలీజ్ అయి అంచ‌నాల‌ని పెంచేసిన విష‌యం తెలిసిందే.

కొంత మంది అభిమానులు గ్రాఫిక్స్ పై పెద‌వి విరిస్తే మ‌రి కొంత మంది మాత్ర 3డీ ఫార్మాట్ లో చూస్తేనే అస‌లు విష‌యం బ‌య‌ట‌ప‌డుతుంద‌ని, టీజ‌ర్ ని చూసి సినిమాని అంచ‌నాల వేయ‌డం క‌రెక్ట్ కాదంటూ విమ‌ర్శ‌ల‌పై థీటుగా స్పందించారు. ఇదిలా వుంటే మారుతి డైరెక్ష‌న్ లో ప్ర‌భాస్ చేయ‌బోతున్న హార‌ర్ థ్రిల్ల‌ర్ అనౌన్స్ మెంట్ తో పాటు 'స‌లార్‌', ప్రాజెక్ట్ కె' ల నుంచి కూడా భారీ అప్ డేట్ లు, స‌రికొత్త లుక్ లు రాబోతున్నాయి. ఈ రెండు ప్రాజెక్ట్ ల‌లో 'స‌లార్ ' లుక్ ఇప్ప‌టికే రివీల్ చేసిన విష‌యం తెలిసిందే.

ఈ ప్రాజెక్ట్ నుంచి మ‌రో భారీ అప్ డేట్ ని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. దీనికి కోసం 'స‌లార్‌' టీమ్ కూడా రెడీ అవుతున్న‌ట్టుగా తెలుస్తోంది. ఇక 'ప్రాజెక్ట్ కె' నుంచి ఇంత వ‌ర‌కు ప్ర‌భాస్ లుక్ పోస్ట‌ర్ బ‌య‌టికి రాక‌పోవ‌డంతో ఫ్యాన్స్ ఈ మూవీ నుంచి కూడా క్రేజీ అప్ డేట్ ని కోరుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌భాస్ న‌టించిన క్రేజీ సినిమాల 4 కె ప్రింట్ ల హ‌డావిడీ కూడా పీక్స్ కి చేరిపోయింది. ఈ మ‌ధ్య స్టార్ హీరోల క్రేజీ సినిమాల‌ని 4కెలోకి మార్చి రీ రిలీజ్ చేస్తున్న విష‌యం తెలిసిందే.

ఈ వ‌రుస‌లో ప్ర‌భాస్ న‌టించిన క్రేజీ సినిమాలు వ‌ర్షం, బిల్లా 4కెలో పుట్టిన రోజు సంద‌ర్భంగా రీ రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. ప్ర‌భాస్ అభిమానుల‌కు బిగ్ స‌ర్ ప్రైజ్ ఇవ్వ‌డానికి రెడీ అవుతున్నాయి. దీంతో ఫ్యాన్స్ భారీ స్థాయిలో సెల‌బ్రేష‌న్స్ కి ప్రిపేర్ అవుతున్నారు. ప్ర‌భాస్ న‌టించిన 'వ‌ర్షం' ని 4కెలో రీ రిలీజ్ చేయాల‌నే ప్ర‌య‌త్నాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ పుట్టిన రోజున అందిరి హీరోల‌ని మించి 'వ‌ర్షం', బిల్లా వంటి సినిమాల‌తో సెల‌బ్రేట్ చేసుకోవాల‌ని ఆశ‌గా ఎదురుచూసిన ఫ్యాన్స్ కి 'వ‌ర్షం' రిలీజ్ డేట్ మార్పు రూపంలో భారీ నిరాశ ఎదురుకాబోతోంది.

అక్టోబ‌ర్ 23న 'వ‌ర్షం' 4కె ప్రింట్ ని రిలీజ్ చేయ‌డం లేద‌ని తెలిసింది. ఆ స‌మ‌యంలో కేవ‌లం 'బిల్లా' 4 కె ప్రింట్ ని మాత్ర‌మే రిలీజ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ట్రైల‌ర్ ని ద‌ర్శ‌కుడు మెహ‌ర్ ర‌మేష్ సోష‌ల్ మీడియా వేదిక‌గా ఫ్యాన్స్ తో పంచుకున్నాడు. ప్ర‌స్తుతం ఈ ట్రైల‌ర్ నెట్టింట ట్రెండ్ అవుతూ ప్ర‌భాస్ ఫ్యాన్స్ ని ఖుషీ చేస్తోంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.