Begin typing your search above and press return to search.

పెళ్లి పనుల్లో బాహుబలి బిజీగా ఉన్నాడా?

By:  Tupaki Desk   |   12 July 2017 11:39 AM IST
పెళ్లి పనుల్లో బాహుబలి బిజీగా ఉన్నాడా?
X
అయిదేళ్ల పాటు ఒకే సినిమాకి కాల్షీట్స్ ఇచ్చి ఇండియా వైడ్ స్టార్ అయిపోయాడు బాహుబలి ప్రభాస్. ముందుగా బాహుబలి పార్ట్ వన్ ఆ తరువాత బాహుబలి పార్ట్ 2 సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ ఇప్పుడు ఏం చేస్తున్నాడనేదే టాలీవుడ్ లో మిలియన్ డాలర్స్ క్వశ్చిన్ గా మారింది. అంటే బాహుబలి తరువాత సుజిత్ డైరెక్షన్ లో సాహో లో ప్రభాస్ నటిస్తున్నాడనే విషయం పై క్లారిటీ ఉన్నా, షూటింగ్ లేని టైమ్ లో ప్రభాస్ షెడ్యూల్ పై కార్లీటి లేదు.

బాహుబలిలో ప్రభాస్ తో పాటు నటించిన రానా, అనుష్క, తమన్నా ఈ సినిమా రిలీజ్ కాకుండానే వేరే సినిమాల్లో నటించారు. ఇప్పుడు కూడా తమ పర్సనల్ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. అంతేకాదు అడపదడప ఫంక్షన్స్ - ప్రెస్ మీట్స్ లో తళ్ళుక్కు మంటున్నారు. రానా అయితే ఏకంగా ఓ టీవీ షోకి హోస్ట్ గా వర్క్ చేస్తున్నాడు. అయితే ఈ బ్యాచ్ కే కాదు అస్సలు సినిమా వాళ్లకే ప్రభాస్ దూరంగా ఉంటున్నాడని వినిపిస్తుంది. బాహుబలి తరువాత పెళ్లి చేసుకుంటా అంటూ గతంలో పరోక్షంగా తన మనసులోని మాటను బయటపెట్టిన ప్రభాస్ ప్రస్తుతం ఆ పనిలోనే తలమునకలైనట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం.

ప్రభాస్ కు తగిన జోడీని వెతికేందుకు తన ఫ్యామిలీ మెంబర్స్ రంగంలోకి దిగినట్లు తెలిసింది. త్వరలోనే ఈ విషయం పై అధికారిక ప్రకటణ కూడా వచ్చే అవకాశం ఉందట. మరి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ డార్లింగ్ ప్రభాస్ ను పెళ్లాడబోతున్న ఆ లక్కీ లేడీ ఎవరో లెట్స్ వెయిట్ అండ్ సీ.