Begin typing your search above and press return to search.

గోపీచంద్ సినిమాలో ప్ర‌భాస్‌?

By:  Tupaki Desk   |   29 Aug 2016 9:30 AM GMT
గోపీచంద్ సినిమాలో ప్ర‌భాస్‌?
X
ఇప్ప‌టిదాకా తెర‌పై గోపీచంద్ రెండు పాత్ర‌ల్లో కనిపించింది లేదు. సంప‌త్ నంది ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న కొత్త సినిమాలో తొలిసారి డ్యూయ‌ల్ రోల్ చేయబోతున్నాడు. ఆ ర‌కంగా సినిమాకి డ్యూయ‌ల్ రోల్ అనేది ఒక అట్రాక్ష‌న్‌ గా మారింది. రెండు పాత్ర‌ల్లో గోపీ ఎలా ఉంటాడో చూడాలని ఆశ‌ప‌డుతున్నారు ప్రేక్ష‌కులు. అయితే ద‌ర్శ‌కుడు సంప‌త్ నంది మాత్రం ఆ సినిమాకి మ‌రొక అట్రాక్ష‌న్‌ ని కూడా తోడు చేయాల‌నే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్టు తెలిసింది. సినిమాలో ప్ర‌భాస్‌ ని ఓ గెస్ట్ రోల్ చేయ‌డానికి ఒప్పించండ‌ని గోపీని అడుగుతున్నాడ‌ట సంప‌త్‌.

గోపీ - ప్ర‌భాస్ మంచి స్నేహితుల‌న్న విష‌యం తెలిసిందే. నిజంగా గోపీచంద్ అడిగితే ప్ర‌భాస్ కాద‌న‌డు. కానీ గోపీచంద్ మాత్రం సినిమా షేప్ అప్ అయ్యేదాన్నిబ‌ట్టి ప్లాన్ చేద్దామ‌ని మాటిచ్చిన‌ట్టు తెలిసింది. తాను, త‌న స్నేహితుడైన ప్ర‌భాస్ క‌లిసి సినిమా చేస్తే అది మ‌రొక స్థాయిలో ఉండాల‌న్న‌ది గోపీ ఆలోచ‌న‌ట‌. ఇదివ‌ర‌కు వ‌ర్షంలో వీళ్లిద్ద‌రూ హీరో - విల‌న్లుగా న‌టించారు. ఆ చిత్రం సూప‌ర్ స‌క్సెస్ అయ్యింది. అప్ప‌ట్నుంచే వీళ్ల కాంబో ఎన్నో అంచ‌నాల్ని రేకెత్తించింది. కానీ గోపీ - ప్ర‌భాస్‌ లు మాత్రం వ‌ర్షంకి ధీటైన క‌థ వచ్చిన‌ప్పుడే క‌లిసి న‌టించాల‌నుకొన్నారు. మ‌రి సంప‌త్ నంది కోరిక మేర‌కు గోపీ ఈసారి ప్ర‌భాస్‌ ని అడుగుతాడా? వాళ్లిద్ద‌రూ క‌లిసి తెర‌పై క‌నిపించ‌బోతున్నారా? ఈ ప్ర‌శ్న‌ల‌కి కాల‌మే స‌మాధానం చెప్పాలి.