Begin typing your search above and press return to search.
పెళ్లికూతురును పల్లకిలో తీసుకు వచ్చిన ప్రభాస్
By: Tupaki Desk | 31 Dec 2018 6:27 AM GMTరమా, రాజమౌళి దంపతుల తనయుడు ఎస్ ఎస్ కార్తికేయ, పూజాల వివాహం ఆదివారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లికి రెండు రోజుల ముందు నుండే సందడి మొదలైంది. సంగీత్ కార్యక్రమంలో టాలీవుడ్ స్టార్స్ వేసిన డాన్స్ లతో పెళ్లి వేడుక అదిరిపోయింది. పెళ్లి పక్కా హిందూ సాంప్రదాయంగా, ఎంతో పద్దతిగా జరిగింది. పెళ్లి వేడుక స్టార్స్ చేసిన సందడి అంతా ఇంతా కాదు. జైపూర్ కోటలో టాలీవుడ్ స్టార్స్ చేసిన హంగామాతో వివాహ వేడుక కనీవిని ఎరుగని రీతిలో నిలిచిపోయింది.
ఈ వేడుకలో పెళ్లి కూతురు పూజాను పల్లకిలో తీసుకు వచ్చిన సమయంలో ప్రభాస్ పక్కనే ఉండటం అందరి దృష్టిని ఆకర్షించింది. పూజాను పల్లకిలో ప్రభాస్ తీసుకు వస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ప్రభాస్ తో పాటు ఇంకా పలువురు స్టార్స్ ఈ పెళ్లి వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తమ ఇంట్లో పెళ్లి అన్నంత హడావుడి చేశారు.
తన సినిమాల్లో అద్బుతమైన సెట్టింగ్స్ ను వేయించే రాజమౌళి తన కొడుకు పెళ్లి కోసం అత్యంత అందమైన వివాహ వేడుక వేదికను ఏర్పాటు చేయించాడు. పెళ్లి మండపం అత్యంత అందంగా ఉందంటూ పెళ్లికి హాజరైన వారు అభినందించారు. మొత్తానికి కార్తికేయ మరియు పూజాల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.