Begin typing your search above and press return to search.
రాధేశ్యామ్ ని మోస్తున్న ప్రభాస్... ?
By: Tupaki Desk | 23 Dec 2021 1:30 AM GMTరాధేశ్యామ్. యూవీ క్రియేషన్స్ బ్యానర్ మీద వస్తున్న భారీ సినిమా. డైరెక్టర్ రాధాక్రిష్ణ. హీరోయిన్ పూజా హెగ్డే. ఇక హీరో ప్రభాస్ పాన్ ఇండిలా లెవెల్ ఇమేజ్ ఉన్న వారు. ఈ మూవీకి రిలీజ్ డేట్ దగ్గరపడుతున్నా ఇంకా ప్రమోషన్ యాక్టివిటీ అయితే పెద్దగా స్టార్ట్ కాలేదు. 23న ప్రీ రిలీజ్ ఫంక్షన్ తో ఒకేసారి వీరలెవెల్ లో క్రేజ్ తీసుకురావాలని చూస్తున్నారు.
నిజానికి పాన్ ఇండియా మూవీస్ ప్రమోషన్స్ కి కనీసం నెల రోజులకు తక్కువ కాకుండా టైమ్ ఉండాలని చెబుతారు. రాజమౌళి ఆ విషయంలో మాస్టర్ డిగ్రీ చేశారు. ఆయనకు సినిమా తీయడమే కాదు, ప్రమోషన్ కూడా ఎలా చేయాలో బాగా తెలుసు. అందుకే ట్రిపుల్ ఆర్ విషయంలో ఆయన ఇప్పటికే సగానికి పైగా పని పూర్తి చేసేశారు. దేశాన్ని అంతా ఒకసారి చుట్టి వచ్చిన జక్కన్న మళ్లీ సెకండ్ టూర్ కి ప్రిపేర్ అవుతున్నాడు.
అదే సమయంలో పాన్ ఇండియా మూవీగా వస్తున్న రాధేశ్యామ్ విషయంలో దూకుడు అవసరం అన్న మాట ఉంది. బాలీవుడ్ వరకూ చూసుకుంటే ప్రభాస్ మాత్రమే ఈ మూవీ వరకూ అక్కడ జనాలకు తెలుసు. డైరెక్టర్ వైజ్ గా చూస్తే రాధాక్రిష్ణకి ఇది రెండవ సినిమా. 2015లో ఆయన తొలిసారిగా జిల్ మూవీ తీశారు. ఆయన్ని ప్రభాస్ ఒక్కసారిగా పాన్ ఇండియా డైరెక్టర్ చేసేశారు.
సినిమా వరకూ చూస్తే ప్రమోషన్ చాలా కీలకం. దాంతో ప్రభాస్ ఇమేజ్ మీదనే బాలీవుడ్ లో ఈ మూవీ లాగాలి. లక్కీగా ప్రభాస్ కి బాలీవుడ్ లో అదిరిపోయే ఇమేజ్ ఉంది. దాంతో ధీమాగా రాధేశ్యామ్ యూనిట్ ఉంది. అంతా ప్రభాస్ పేరు మీదనే సాగిపోతుంది అన్న ఆలోచనలలో ఉన్నారు. ఇక ప్రభాస్ కూడా బాలీవుడ్ లో ఒక్క లెక్కన ప్రమోషన్ మొదలెడితే తప్ప అనుకున్న కలెక్షన్ల టార్గెట్ రీచ్ కాలేరు అంటున్నారు.
ఇక ఈ మూవీ కూడా కాకతాళీయంగానే అయినా రాజమౌళి మూవీతో ఢీ కొడుతోంది. జక్కన్న జోరుతో పోటీ పడాల్సిన అనివార్యత కూడా ఏర్పడుతోంది. మొత్తానికి చూసుకుంటే ప్రభాస్ ని బాహుబలిగా కత్తి ఇచ్చి బాలీవుడ్ లో నిలబెట్టిన జక్కన్న ఇపుడు ట్రిపుల్ ఆర్ తో సై అంటున్నారు. మరి ప్రభాస్ కూడా ఎక్కడా తగ్గకుండా రాజమౌళి తో రేసులో పాల్గొనాల్సిందే.
ఇక్కడ మరో విశేషం చెప్పుకోవాలి. ట్రిపుల్ ఆర్ కి బాలీవుడ్ లో అసలైన అట్రాక్షన్ రాజమౌళి అనే అంతా అంటున్నారు. అలాగే రాధేశ్యామ్ కి ప్రభాసే సర్వస్వంగా ఉన్నారు. అటు ఇటూ తిరిగి బాలీవుడ్ లో పోటీ ఈ ఇద్దరు మధ్యనే గట్టిగా సాగనుందని తెలుస్తోంది. మరి బాలీవుడ్ లో ఎవరు పవర్ ఎంతో తేల్చేసే సినిమాలు ఇవే అంటున్నారు.