Begin typing your search above and press return to search.

ఇంట్రెస్టింగ్ గాసిప్: 'ప్రభాస్ - చరణ్' పాన్ ఇండియా మల్టీస్టారర్..!

By:  Tupaki Desk   |   21 Aug 2021 11:37 AM GMT
ఇంట్రెస్టింగ్ గాసిప్: ప్రభాస్ - చరణ్ పాన్ ఇండియా మల్టీస్టారర్..!
X
టాలీవుడ్ లో ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు - మ‌ల్టీస్టారర్స్ ఊపందుకున్నాయి. ప్రతీ హీరో కూడా క్రేజ్ తో సంబంధం లేకుండా మల్టీలాంగ్వేజ్ సినిమాలు చేస్తున్నారు. అలానే స్టార్ హీరోలు సైతం ఇతర హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకోడానికి ముందుకు వస్తున్నారు. ప్రస్తుతం అనేక మల్టీస్టారర్స్ సెట్స్ మీద ఉన్నాయి. మరికొన్ని చర్చల దశలో ఉన్నాయి. ఈ క్రమంలో మరో క్రేజీ పాన్ ఇండియా మల్టీస్టారర్ కు బీజం పడుతోందని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరూ టాలీవుడ్ స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు. 'బాహుబలి' సినిమాతో వరల్డ్ వైడ్ క్రేజ్ తెచ్చుకున్న ప్రభాస్.. వరుసగా భారీ ప్రాజెక్ట్స్ చేస్తూ పాన్ ఇండియా స్టార్ గా వెలుగొందుతున్నారు. మరోవైపు చరణ్ 'ఆర్ ఆర్ ఆర్' చిత్రంతో పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేసాడు. అయితే ఇప్పుడు వీరిద్దరితో ఓ మల్టీస్టారర్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని టాక్ వినిపిస్తోంది.

ప్రభాస్ సన్నిహితులైన యూవీ క్రియేషన్స్ టీమ్ ఈ పాన్ ఇండియా మల్టీస్టారర్ ను ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. యూవీ ప్రొడక్షన్ లో 'రన్ రాజా రన్' 'సాహో' వంటి సినిమాలు తెరకెక్కించిన యంగ్ డైరెక్టర్ సుజీత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారని సోషల్ మీడియాలో చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం ప్రభాస్ తో 'రాధే శ్యామ్' చిత్రాన్ని రూపొందిస్తున్న యూవీ క్రియేషన్స్ వారు.. రామ్ చరణ్ తో ఓ సినిమా చేయడానికి కమిట్ మెంట్ తీసుకున్నారని చాలా రోజులుగా వస్తున్నాయి.

ఈ క్రమంలో చరణ్ - సుజీత్ కాంబినేషన్ లో యూవీ నిర్మాతలు ఓ ప్రాజెక్ట్ సెట్ చేసారని కూడా అనుకున్నారు. అయితే ఇంతవరకు దీనిపై క్లారిటీ రాలేదు. మరోవైపు 'ఆర్ ఆర్ ఆర్' 'ఆచార్య' సినిమాల షూటింగ్స్ పూర్తి చేసిన చెర్రీ.. అగ్ర దర్శకుడు శంకర్ తో ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ప్లాన్ చేసుకున్నారు. దీని తర్వాత మెగా పవర్ స్టార్ చేయబోయే సినిమా సుజీత్ డైరెక్షన్ లోనే ఉంటుందని ఆ మధ్య వార్తలు వచ్చాయి.

ఇప్పుడు లేటెస్టుగా సుజీత్ డైరెక్ట్ చేసే సినిమాలో రామ్ చరణ్ ఒక్కడే కాదు.. ప్రభాస్ కూడా మరో హీరోగా నటిస్తారని ఓ రూమర్ బయటకు వచ్చింది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో ఈ మల్టీస్టారర్ పాన్ ఇండియా స్థాయిలో రూపొందనుందని అంటున్నారు. ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ.. నిజమైతే మాత్రం సినీ అభిమానులకు పండగే అని చెప్పవచ్చు.

ప్రభాస్ - రామ్ చరణ్ వంటి ఇద్దరు స్టార్ హీరోలు ఒకే స్క్రీన్ పై కనిపిస్తే వారి ఫ్యాన్స్ తో పాటుగా సాధారణ ప్రేక్షకులు ఖుషీ అవుతారని చెప్పవచ్చు. డార్లింగ్ ఇంత వరకు మల్టీస్టారర్ మూవీ చేయలేదు. మరోవైపు రామ్ చరణ్ ఇప్పటికే అల్లు అర్జున్ తో 'ఎవడు'.. ఎన్టీఆర్ తో కలిసి 'ఆర్ ఆర్ ఆర్' సినిమాలు చేసాడు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తన తండ్రి చిరంజీవితో కలిసి చేస్తున్న 'ఆచార్య' మూవీ కూడా మల్టీస్టారరే.

ఈ క్రమంలో సుజీత్ దర్శకత్వంలో చరణ్ - ప్రభాస్ కలిసి భారీ ప్రాజెక్ట్ లో నటిస్తారేమో చూడాలి. ఇకపోతే ప్రభాస్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తో 'సలార్' - ఓం రౌత్ డైరెక్షన్ లో 'ఆదిపురుష్' - నాగ్ అశ్విన్ తో 'ప్రాజెక్ట్ K' వంటి సినిమాలు చేస్తున్నారు. మరోపక్క రామ్ చరణ్.. శంకర్ దర్శకత్వంలో 'RC15' ను సెట్స్ మీదకు తీసుకెళ్లాలని చూస్తున్నాడు.