Begin typing your search above and press return to search.
లైఫ్ ఇచ్చిన నిర్మాతకు ప్రభాస్ సాయం
By: Tupaki Desk | 12 Nov 2017 10:32 AM GMTప్రభాస్ కెరీర్ ను మలుపు తిప్పిన సినిమా ఏదంటే.. మరో మాట లేకుండా ‘వర్షం’ అని చెప్పేయొచ్చు. అంతకుముందు అతను చేసిన ‘ఈశ్వర్’.. ‘రాఘవేంద్ర’ సినిమాలు అతడికి ఆశించిన ఫలితాన్నివ్వలేదు. ఐతే ‘వర్షం’ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్టయి ప్రభాస్ కు స్టార్ ఇమేజ్ తెచ్చిపెట్టింది. ఈ సినిమాను నిర్మించింది ఎం.ఎస్.రాజు అన్న సంగతి తెలిసిందే. అప్పటికే ‘ఒక్కడు’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తీసిన రాజుతో సినిమా చేయడానికి చాలామంది స్టార్లు రెడీగా ఉన్నప్పటికీ.. ఆయన మాత్రం కెరీర్లో తొలి అడుగులు వేస్తున్న ప్రభాస్ ను హీరోగా ఎంచుకుని అన్నీ తానై ‘వర్షం’ సినిమా తీశారు. ఆ రకంగా ప్రభాస్ కు ఎం.ఎస్.రాజు పెద్ద సాయమే చేసినట్లే.
ఆ సాయాన్ని గుర్తు పెట్టుకుని ఇప్పుడు రుణం తీర్చుకునే పనిలో పడ్డాడట ప్రభాస్. హీరోగా ఒడుదొడుకులు ఎదుర్కొంటున్న ఎం.ఎస్.రాజు తనయుడు సుమంత్ అశ్విన్ కు ప్రభాస్ ఒక క్రేజీ ప్రాజెక్టులో ఛాన్స్ ఇప్పించాడు. ఇటీవలే సుమంత్ అశ్విన్-కొణిదెల నిహారిక జంటగా ‘హ్యాపీ వెడ్డింగ్’ అనే సినిమా మొదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్ లాంటి పెద్ద సంస్థ నిర్మిస్తోంది. ఆ సంస్థ అధినేతలు వంశీ.. ప్రమోద్-ప్రభాస్ ఆప్త మిత్రులన్న సంగతి తెలిసిందే. ప్రభాస్ సినిమా ‘మిర్చి’తో నిర్మాతలుగా పరిచయమైన వీళ్లిద్దరూ వరుస విజయాలతో దూసుకెళ్తున్నారు. ఇటీవలే ‘మహానుభావుడు’తో హిట్ కొట్టారు. ఇప్పుడు ప్రభాస్ హీరోగా ‘సాహో’ లాంటి భారీ సినిమా తీస్తున్నారు. ఇలాంటి స్థితిలో వాళ్లు సుమంత్ అశ్విన్ లాంటి చిన్న హీరోతో సినిమా చేయడానికి ముందుకు రావడం విశేషమే. ప్రభాస్ సూచన మేరకే వాళ్లు అతడిని హీరోగా తీసుకున్నారట. మొత్తానికి ఎం.ఎస్.రాజు చేసిన సాయాన్ని గుర్తుపెట్టుకుని ప్రభాస్ ఆయనకిలా సాయం చేయడం గొప్ప విషయమే.