Begin typing your search above and press return to search.
మిర్చి టైం లో అప్పు గురించి ప్రభాస్ కామెంట్..!
By: Tupaki Desk | 30 Dec 2022 10:30 AM GMTఅన్ స్టాపబుల్ సీజన్ 2 లో ప్రభాస్ ఎపిసోడ్ హైలెట్ గా నిలుస్తుంది. ఈ ఎపిసోడ్ రెండు పార్ట్ లుగా రిలీజ్ చేస్తుండగా మొదటి పార్ట్ లోనే సూపర్ స్టఫ్ ఇచ్చారు ఆహా టీం. ముఖ్యంగా ప్రభాస్ పెళ్లి గురించి.. గాళ్ ఫ్రెండ్స్ గురించి బాలయ్య ఓ రేంజ్ లో ఆటపట్టించాడు.
ప్రభాస్ లైఫ్ లో ఆ మేడం ఎవరో కనిపెట్టాలని బాలయ్య బాగా ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో మిర్చి టైం లో తన అప్పుల గురించి కూడా బయట పెట్టాడు ప్రభాస్.
ఛత్రపతి సినిమా తర్వాత రాజమౌళితో బాహుబలి సినిమా ఛాన్స్ వచ్చిందని. అంతకుముందు రెబల్ కోసం కొన్ని అప్పులు కాగా మిర్చి తీసి అవి తీర్చాలని అనుకున్నాం కాకపోతే రెబల్ ఆల్రెడీ తీశాను కదా మళ్లీ మరో సినిమా అంటే రాజమౌళి ఒప్పుకుంటాడో లేదో అని రమా రాజమౌళి దగ్గర ప్రస్తావిస్తే పర్లేదు మనోడు ఎలాగు సినిమా చిన్నగా తీస్తాడు నువ్వు ఈలోగా ఒక సినిమా చేసేయొచ్చని అన్నారట. అలా మిర్చి సినిమా తీశానని అన్నారు ప్రభాస్.
మిర్చి సినిమా వల్ల రెబల్ సినిమాకు అయిన కొద్దిపాటి అప్పులని తీర్చానని అన్నారు. మిర్చి సినిమా అప్పటివరకు ప్రభాస్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అయితే బాహుబలికి ముందు మిర్చి సినిమా రావడం కూడా మంచిదే అయ్యింది.
కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కిన మిర్చి సినిమాని యువి క్రియేషన్స్ బ్యానర్ లో వంశీ, ప్రమోద్ నిర్మించారు. ఆ సినిమాతోనే యువి బ్యానర్ తమ సినిమాలను మొదలు పెట్టింది. కొత్త బ్యానర్.. కొత్త డైరెక్టర్ తో ప్రభాస్ మిర్చితో సాహసం చేశాడని చెప్పొచ్చు.
అలా మిర్చి నాటి విషయాలను ప్రస్తావించారు ప్రభాస్. అన్ స్టాపబుల్ షోలో ప్రభాస్ ఎంట్రీ అదిరిపోయింది. స్ట్రీమింగ్ అయిన నిమిషాల్లోనే ఇది లక్షల కొద్దీ వ్యూస్ తో సెన్సేషన్ అయ్యింది. ఆహా ప్రభాస్ అన్ స్టాపబుల్ ఎపిసోడ్ రికార్డ్ వ్యూస్ రాబడుతుందని చెప్పొచ్చు. పార్ట్ 1 మాత్రమే కాదు పార్ట్ 2 కూడా మరో రేంజ్ లో ఉండబోతుందని అర్థమవుతుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.