Begin typing your search above and press return to search.
ప్రభాస్ కట్టిస్తున్న బాహుబలి థియేటర్లు!
By: Tupaki Desk | 7 Sep 2017 7:11 AM GMTఇంతకాలం సినిమాలతో తన రేంజ్ చూపించిన డార్లింగ్ ప్రభాస్ ఇప్పుడు థియేటర్ల వ్యాపారంలోకి దిగారు. బాహుబలి మూవీతో తన ఇమేజ్ ను భారీగా పెంచుకున్న ఆయన తాజాగా నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో భారీ ఎత్తున థియేటర్లను నిర్మిస్తున్నారు. ఈ థియేటర్ల క్యాంపస్ ను బాహుబలి థియేటర్లుగా వ్యవహరిస్తున్నారు.
ఏడున్నర ఎకరాల భూమిలో నిర్మిస్తున్న ఈ మూడు థియేటర్ల మల్టీఫ్లెక్స్ స్పెషాలిటీస్ వింటే అవాక్కు అవ్వాల్సిందే. దేశంలో మరెక్కడా లేని రీతిలో ఈ థియేటర్ల కాంప్లెక్స్ ను సిద్ధం చేస్తున్నారు.మొత్తం రూ.40 కోట్ల బడ్జెట్ తో రూపొందిస్తున్న బాహుబలి థియేటర్లు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
సూళ్లూరుపేట సమీపంలోని నేషనల్ హైవే మీద నిర్మిస్తున్న బాహుబలి థియేటర్లలో స్పెషల్ అట్రాక్షన్ ఏమిటంటే.. ఒక భారీ త్రీడీ థియేటర్ ను నిర్మిస్తున్నారు. 670 సీట్లు ఉండే ఈ థియేటర్లో 106 అడుగుల భారీ స్క్రీన్ ఏర్పాటు చేస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని రీతిలో త్రీడీ ఎఫెక్ట్స్ లు ఈ థియేటర్ సొంతమంటున్నారు.
మిగిలిన రెండు థియేటర్లలో 170సీట్ల చొప్పున ఉంటాయని చెబుతున్నారు. బాహుబలి థియేటర్ల కాంప్లెక్స్ ఆవరణలో రెస్టారెంట్లు.. చిన్నపిల్లల ఆటలకు ప్రత్యేకమైన విభాగాన్ని తయారు చేస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా నిర్మిస్తున్న ఈ థియేటర్ ను 2018లో ప్రారంభించనున్నారు.