Begin typing your search above and press return to search.
ప్రభాస్ చెప్పాకే భాగమతిగా..
By: Tupaki Desk | 29 Oct 2015 7:30 AM GMTఇప్పుడు చారిత్రాత్మక చిత్రాల సీజన్ నడుస్తోంది. రుద్రమదేవి సూపర్ హిట్ కావడం, కంచె కూడా అదే బాటలో ఉండడంతో.. గతంలో అనుకున్న ఓ ప్రాజెక్ట్ మళ్లీ తెరపైకొచ్చింది. హైదరాబాద్ ను కట్టించిన నవాబు మహ్మద్ కులీ కుతుబ్ షా ప్రేమికురాలు అయిన భాగమతి అనే పాత్రను అంగీకరించినట్లు తెలుస్తోంది. బంజారా స్త్రీ అయిన భాగమతి.. నవాబును పెళ్లి చేసుకున్నాక హైదర్ మహల్ అని పేరు మార్చుకుంది. అలా ఆమె పేరు మీదనే హైదరాబాద్ , భాగ్యనగర్ అనే పేర్లు వచ్చాయి.
ఇప్పుడీ భాగమతి పాత్రనే లీడ్ రోల్ గా తీసుకుని భాగమతిని తెరకెక్కించనున్నారు. అయితే.. ఈ పాత్రను మొదట తిరస్కరించింది అనుష్క. కానీ ప్రభాస్ రంగంలోకి దిగి ఒప్పించడంతో.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందిట స్వీటీ. రెబెల్ స్టార్ స్నేహితులు ప్రమోద్, వంశీలు యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని తెరకెక్కించనుండగా.. అశోక్ కుమార్ డైరెక్ట్ చేయనున్నాడు.
అశోక్ దర్శకత్వంపై అనుమానంతో అనుష్క నో చెప్పగా.. అలాంటి అనుమానాలు అవసరం లేదని ప్రభాస్ ఆమెకు వివరణ ఇచ్చాడంటున్నారు టాలీవుడ్ జనాలు. అదే సమయంలో రుద్రమదేవి లాగా మరో చారిత్రాత్మక చిత్రం కావడంతో, భాగమతి కూడా చరిత్రలో నిలిచే సినిమా కానుంది.