Begin typing your search above and press return to search.

ప్ర‌ధాన మంత్రితో ప్ర‌భాస్ క్యూట్ స్టెప్పులు

By:  Tupaki Desk   |   16 April 2022 5:08 PM GMT
ప్ర‌ధాన మంత్రితో ప్ర‌భాస్ క్యూట్ స్టెప్పులు
X
టిప్పు టిప్పు బ‌ర్సా పానీ.. ! 'మొహ్రా' సినిమా నుంచి క్లాసిక్ సాంగ్ ఇది. అక్ష‌య్ కుమార్ - ర‌వీనా టాండ‌న్ జంట ఈ పాట‌లో అదిరిపోయే రొమాన్స్ తో చెల‌రేగి కుర్రకారు కంటికి కునుకు ప‌ట్ట‌నివ్వ‌ని ట్రీటిచ్చారు. 90ల‌లో ఇది వెరీ స్పెష‌ల్ మూవీగా నిలిచిందంటే ర‌వీనా టాండ‌న్ అంద‌చందాలు గ్లామ‌ర్ ఎలివేష‌న్ డ్యాన్సులు ఆ రేంజులో కిక్కిచ్చాయి కాబ‌ట్టే.

అయితే ఇప్పుడు అదే పాట‌కు డార్లింగ్ ప్ర‌భాస్ క్యూట్ స్టెప్పులేశాడు. ర‌వీనా టాండ‌న్ తో క‌లిసి అత‌డు వేసిన స్టెప్పులు ఇప్పుడు అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారాయి. # ప్ర‌భాస్ విత్ ప్రైమ్ మినిస్ట‌ర్ ర‌వీనాటాండ‌న్ అంటూ అభిమానులు ఈ వీడియోని జోరుగా వైర‌ల్ చేస్తున్నారు.

హౌ క్యూట్ అంటూ డార్లింగ్ ఫ్యాన్స్ ఎంతో ఉబ్బిత‌బ్బిబ్బ‌యిపోతున్నారు. ఈ సంద‌డంతా బాలీవుడ్ బుల్లితెర‌ రియాలిటీ షోలో చేసిన‌ది. ఇక ర‌వీనా టాండ‌న్ ఇటీవ‌ల కేజీఎఫ్ 2లో ప్ర‌ధానిగా న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఆ పాత్ర‌కు చ‌క్క‌ని స్పంద‌న ల‌భిస్తోంది.

ఆస‌క్తిక‌రంగా డార్లింగ్ ప్రభాస్ స‌ర‌స‌న సాహో చిత్రంలో న‌టించిన శ్ర‌ద్ధా క‌పూర్ రియాలిటీ వేదిక‌పై జ‌డ్జి ప్యానెల్ లో క‌నిపించింది. ర‌వీనా చెయ్యి అందుకుని ప్ర‌భాస్ స్టెప్పులేస్తుంటే రొమాంటిక్ ఫోజులిస్తుంటే శ్ర‌ద్ధా ఎంతో చిల్లింగ్ గా క‌నిపించింది.

ఇలాంటి అరుదైన మూవ్ మెంట్ మ్యాజికల్ గా ఉంద‌న్న ఫీలింగ్ శ్ర‌ద్ధాలో క‌నిపించింది. డార్లింగ్ ప్ర‌భాస్ కి ఉత్త‌రాదిన పెరుగుతున్న క్రేజ్ కి ఇది సింబాలిక్. అత‌డు క‌నిపిస్తే చాలు ఫ్యాన్స్ పిచ్చెక్కుతున్నారు. ఇన్నాళ్లు సౌత్ కే అంకితం అనుకుంటే ఇప్పుడు స‌రిహ‌ద్దులు చెరిపేశాడు డార్లింగ్. సౌత్ స్టార్లు అంద‌రికీ అత‌డు రోల్ మోడ‌ల్ గా మారాడు.

ప్రభాస్ కాంపిటీష‌న్ అనే అగ్గిని రాజేశాడు. దానిని దావాన‌లంలా మార్చేందుకు బ‌న్ని- రామ్ చ‌ర‌ణ్ - తార‌క్ ఒక‌రితో ఒక‌రు పోటీప‌డుతున్నారు. త‌దుప‌రి పాన్ ఇండియా రేస్ లోకి మ‌హేష్ కూడా దూసుకొస్తున్నాడు. దీంతో ఫారెన్ హీట్ అగ్గి ఒక్క‌సారిగా ప‌దింత‌లైంది.