Begin typing your search above and press return to search.

బారాత్‌ లో డ్యాన్సులు సరే.. నీ పెళ్లెప్పుడు రాజా.!

By:  Tupaki Desk   |   29 Dec 2018 4:53 AM GMT
బారాత్‌ లో డ్యాన్సులు సరే.. నీ పెళ్లెప్పుడు రాజా.!
X
బాహుబలి సినిమా టైమ్‌ లో రెండే రెండు ప్రశ్నలు అభిమానుల్ని నిద్ర లేకుండా చేశాయి. అందులో ఒకటిది కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు.? సినిమా రిలీజ్‌ తర్వాత ఆ విషయం అందరికి తెలిసిపోయింది. ఇక రెండో ప్రశ్న.. రియల్‌ బాహుబలి ప్రభాస్‌ పెళ్లెప్పుడు చేసుకుంటాడు అని. ఇప్పటివరకు ఈ ప్రశ్నకు మాత్రం సమాధానం రాలేదు.

ప్రభాస్‌ ప్రస్తుతం రాజమౌళి కొడుకు కార్తికేయ పెళ్లిలో ఫుల్‌ బిజీగా ఉన్నాడు. రామ్‌ చరణ్‌ - ఎన్టీఆర్‌ - రానా లాంటి స్టార్స్‌ మొత్తం నిన్న పెళ్లికి బయలుదేరితే.. రెండు రోజుల ముందే జైపూర్‌ చేరుకున్నాడు ప్రభాస్‌. ప్రస్తుతం అక్కడ ప్రభాస్‌ హంగామా మామూలుగా లేదు. రచ్చ రచ్చ చేస్తున్నాడు. బారాత్‌ లలో డ్యాన్సులు చేస్తున్నాడు. తన సొంత తమ్ముడి పెళ్లి ఎలా చేస్తాడో.. అలా అన్నీ దగ్గరుండీ చూసుకుంటున్నాడు. ఇవన్నీ చూస్తున్నవాళ్లు.. బారాత్‌ లో డ్యాన్సులు సరే.. మరి నీ పెళ్లెప్పుడు అని అడుగుతున్నారు. దానికి మనోడి సమాధానం చిన్న చిరునవ్వే.

ప్రభాస్‌ ఏజ్‌ దాదాపు 40 దగ్గరకు వచ్చేసింది. ప్రబాస్‌ కంటే తక్కువ వయసున్న చిన్నహీరోలకు ఇప్పటికే ఇద్దరేసి పిల్లలు ఉన్నారు. కానీ ప్రభాస్‌ మాత్రం పెళ్లి మాట మాత్రం ఎత్తడం లేదు. బాహుబలి తర్వాత శుభవార్త చెప్తాను అని ప్రకటించిన ప్రభాస్‌.. ఇంతవకు ఆ గుడ్‌ న్యూస్‌ మాత్రం చెప్పడం లేదు. మరి కొత్త ఏడాదిలో అయిన ప్రభాస్‌ నోటివెంట శుభవార్త వస్తుందేమో చూడాలి.