Begin typing your search above and press return to search.

`ప్రాజెక్ట్ -కె` కోసం అనంద్ మ‌హీంద్రానే దించాసారే!

By:  Tupaki Desk   |   5 March 2022 4:26 AM GMT
`ప్రాజెక్ట్ -కె` కోసం అనంద్ మ‌హీంద్రానే దించాసారే!
X
పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా `మ‌హాన‌టి` ఫేం నాగ్ అశ్విన్ `ప్రాజెక్ట్ -కె`ని ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. సైన్స్ ఫిక్ష‌న్ బ్యాక్ డ్రాప్ లో చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. 400 కోట్ల బ‌డ్జెట్ తో వైజ‌యంతీ మూవీస్ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తోంది. స‌ద‌రు సంస్థ‌లో ఇదే తొలి భారీ బ‌డ్జెట్ చిత్రం స‌హా టాలీవుడ్ నుంచి అగ్ర‌గామి సంస్థ‌గా ఖ్యాతికెక్క‌బోతుంది. `బాహుబ‌లి`..`ఆర్ఆర్ ఆర్` లాంటి భారీ బ‌డ్జెట్ చిత్రాల‌కు పోటీగా ప్రాజెక్ట్ -కెని దించుతున్నారు.

అమితాబ‌చ్చ‌న్..దీపికా ప‌దుకొణే లాంటి టాప్ స్టార్ల‌ను సినిమాలో భాగం చేసారు. విదేశీ టెక్నీషియ‌న్ల‌ని సైతం రంగంలోకి దించుతున్నారు. అయితే ఇంత‌టి ప్రెస్టీజియ‌స్ ప్రాజెక్ట్ లో ప్ర‌ముఖ వ్యాపార వేత్తానంద్ మ‌హీంద్రాని సైతం భాగం చేస్తున్నారు. సినిమాకి సంబంధించి ఆనంద్ మ‌హీంద్రా సాయం కోరుతూ నాగ్ ఆశ్విన్ శుక్ర‌వారం వ‌రుస ట్వీట్లు చేసారు. ``డియర్ ఆనంద్ మ‌హీంద్రా స‌ర్ . మీరు ఎన్నో విష‌యాల్లో నాకు స్ఫూర్తిగా నిలిచారు. ప్ర‌స్తుతం నేను అమితాబ్...దీపికా ప‌దుకొణే ..ప్ర‌భాస్ తో `ప్రాజెక్ట్ కె` అనే సైన్స్ ఫిక్ష‌న్ చిత్రాన్ని పొందిస్తున్నా.

దీని కోసం మేము స‌రికొత్త ప్ర‌పంచాన్ని సృష్టిస్తున్నాం. ఇప్పుడీ ప్ర‌పంచం కోస‌మే కొన్ని ప్ర‌త్యేక‌మైన వాహ‌నాలు త‌యారుచేస్తున్నాం. ఇవ‌న్నీ ప్ర‌స్తుత టెక్నాల‌జీని మించి ఉంటాయి. ఈ చిత్రాన్ని అనుకున్న‌ట్లు గనుక తీయ‌గ‌లిగితే..అది మ‌న దేశానికే గ‌ర్వ కార‌ణం అవుతుంది. మా టీమ్ లో ప్ర‌తిభావంతులైన ఇంజ‌నీర్లు..డిజైన‌ర్లు ఉన్నారు. భారీ బ‌డ్జెట్ సినిమా కాబ‌ట్టి మీ స‌హ‌కారం కూడా కావాలి`` అని అశ్విన్ మ‌హీంద్రాని కోరారు.

దీనికి ఆనంద్ మ‌హీంద్రా ఇలా రిప్లై ఇచ్చారు. ``భ‌విష్య‌త్ ని ఊహించ‌డంలో మీకు స‌హాయ‌ప‌డే అద్భుత‌మైన అవ‌కాశాన్ని నేనెలాతిర‌స్క‌రించ‌గ‌ల‌ను నాగ్ అశ్విన్. మా గ్లోబ‌ల్ ప్రొడ‌క్ట్ డెవ‌లె ప్ మెంట్ చీప్ వేలు మ‌హీంద్రా మీకు కావాల్సిన స‌హ‌కారం అందిస్తారు. త‌ను ఇప్ప‌టికే ఎక్స్ యూవీ 700 కారు రూపొందించారు` అని తెలిపారు.

మొత్తానికి నాగ్ అశ్విన్ `ప్రాజెక్ట్ -కె` కోసం ఏకంగా మహీంద్రా గ్రూప్ టెక్నాల‌జీనే రంగంలోకి దించేస్తున్నారు. మ‌రి టెక్నాల‌జీ ప‌రంగానే నాగ్ అశ్విన్ స‌హాయం కోరారా? లేక నిర్మాణం లో కూడా మ‌హీంద్రా ని భాగం చేస్తున్నారా? అన్న సందేహాలు తెర‌పైకి వ‌స్తున్నాయి. ఇక సినిమా గురించి నాగ్ అశ్విన్ చాలా ఆస‌క్తిక‌ర విష‌యాలు రివీల్ చేసారు. `ప్రాజెక్ట్ - కె` కోసం ఓ కొత్త ప్ర‌పంచాన్ని సృష్టిస్తున్న‌ట్లు రివీల్ చేయ‌డంతో సినిమాపై మ‌రింత ఆస‌క్తి పెరుగుతోంది.