Begin typing your search above and press return to search.
ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కు బాహుబలి కోటి విరాళం
By: Tupaki Desk | 7 Dec 2021 6:55 AM GMTఇండస్ట్రీలో ప్రభాస్‌ని అంతా డార్లింగ్ అంటూ పిలుస్తుంటారు. తను కూడా అంతే ప్రేమగా ఇండస్ట్రీలో తనకు పరిచయం వున్న వాళ్లని పిలుస్తుంటాడు. ప్రభాస్ గురించి తెలిసిన వాళ్లు ఆయన మనసు కల్మషం లేనిదని, ఇంతటి స్టార్‌డమ్ వచ్చినా కించిత్ గర్వం కూడా అతనిలో కనిపించదని ప్రభాస్ గురించి తెలిసిన వాళ్లు చెబుతుంటారు.
నిజమే ఎదిగే కొద్ది ఒదిగి వుండాలంటారు పెద్దలు.. ఆ సూత్రాన్ని తూచా తప్పకుండా పాటించే వ్యక్తలు చాలా కొద్ది మందే వుంటారు. ఆ కొద్ది మందిలో మొట్ట మొదటి స్థానంలో నిలిచే మంచి వ్యక్తిత్వం వున్న వ్యక్తి ప్రభాస్.
ఆయన ఏ సినిమా చేసినా భారీగానే వుంటుంది. అలాగేఏది చేసినా భారీతనమే కనిపిస్తుంది. సాయంలోనూ అదే గుణం కనిపించడం విశేషం. హీరోగా ఇంతింతై వటుడింతై అన్నచందంగా తెలుగు సినిమా కీర్తిని నలుదిశలా ప్రకాశింప జేస్తున్న ప్రభాస్ సాయం అందించడంలోనే అదే తరహా భారీ మనసుని ప్రదర్శిస్తూ చాలా మందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు.
సమాజంలో ప్రకృతి వైపరిత్యాలు సంభవించి ఆస్తినష్టం జరిగి సామాన్యులు ఇబ్బందులకు గురవుతున్న సందర్భాల్లో నేనున్నానంటూ ప్రభాస్ ఆపన్న హస్తం అందించి తన పెద్ద మనసు చాటుకుంటున్నారు.
తాజాగాప్రభాస్ తన పెద్ద మనసుని చాటుకున్నారు. ఇటీవల ఆంధ్ర ప్రదేశ్‌ని వర్షాలు, వరదలు ముంచెత్తి జనజీవితాన్ని అస్తవ్యస్తం చేసిన విషయం తెలిసిదందే అకారణంగా సంభవించిన వర్షాలు, వరదల కారణంగా ఎంతో మంది నివాసాలతో పాటు చాలా పోగొట్టుకున్నారు. వారిని ఆదుకోవడానికి ఏపీ ప్రభుత్వం చేయాల్సిన దంతా చేస్తూనే వుంది.
ఇండస్ట్రీ నుంచి కూడా ఎంతో మంది హీరోలు తమకు తోచిన సహాయాన్ని ప్రకటిస్తూ ఏపీ ప్రభుత్వానికి అండగా నిలుస్తున్నారు. సీఎం రిలీఫ్ ఫండ్‌కి భారీగా విరాళాలు అందిస్తున్నారు. తాజాగా ప్రభాస్ తను కూడా సీఎం రిలీఫ్ ఫండ్ కి విరాళాన్ని అందిస్తున్నట్టుగా ప్రకటించారు. ఆయన తన వంతుగా కోటి రూపాయాలు విరాళం అందిస్తున్నట్టుగా వెల్లడించారు.
గతంలో హైదరాబాద్ వరదల కారణంగా ఇబ్బందులు పడుతున్న జనం కోసం తెలంగాణ సీఎం సహయ నిధికి అక్షరాలా కోటి రూపాయలు ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.
అంతే కాకుండా కరోనా విలయాన్ని సృష్టిస్తున్న వేళ నేనున్నానంటూ ముందుకు వచ్చి ఏకంగా 4.5 కోట్లు అందించారు. తాజాగా ఏపీ వరదల నేపథ్యంలో కోటి ప్రకటించడంతో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్త మవుతున్నాయి. ప్రభాస్ గొప్ప మనసుకి అంతా హ్యాట్సాఫ్ చెబుతున్నారు.