Begin typing your search above and press return to search.
టాలీవుడ్ లో సొంత కారవ్యాన్ లేని హీరో?
By: Tupaki Desk | 22 Sep 2018 5:02 PM GMTఖరీదైన వ్యానిటీ వ్యాన్ (కారవ్యాన్)ని సొంతం చేసుకోవాలంటే అందుకు తగ్గ రేంజ్ ఉండాలి. ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న అగ్ర హీరోలంతా సొంతంగా కారవ్యాన్ ని ఉపయోగిస్తున్నారు. ఒకవేళ కారవ్యాన్ లేని హీరోలకు నిర్మాతలే ఎరేంజ్ చేస్తుంటారు. ఆన్ లొకేషన్ సౌకర్యార్థం ఈ కారవ్యాన్ తప్పనిసరి. అయితే మన స్టార్లలో ఎవరెవరికి కారవ్యాన్ ఫెసిలిటీ ఉంది? అన్నది పరిశీలిస్తే..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి సొంతంగా ఓ కారవ్యాన్ ఉంది. ఈ కారవ్యాన్ ఖరీదు 8 కోట్లు. `ఎవడు` టైమ్ లో ఈ లగ్జరీ కారవ్యాన్ ని చరణ్ కొనుక్కున్నారు. బాలీవుడ్‌లో కింగ్ ఖాన్ షారూక్ - సల్మాన్ లకు కారవ్యాన్ డిజైన్ చేసిన దిలీప్ అనే కస్టమ్ మేడ్ డిజైనర్ ఈ కారవ్యాన్ ని రూపొందించారు. చరణ్ ఈ కారవ్యాన్ కొనే ముందే సల్మాన్ - షారూక్ కారవ్యాన్ డిజైన్లను పరిశీలించారట. ఆల్మోస్ట్ 5స్టార్ ఫెసిలిటీస్ ఇందులో అందుబాటులో ఉంటాయిట. టాలీవుడ్ హీరోల్లోనే అత్యంత ఖరీదైన ఆస్టన్ మార్టిన్ కార్ ని ఉపయోగించే చరణ్ తన అభిరుచి మేరకు కారవ్యాన్ ని చాలా ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్నారట. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్- అశోక్ లేల్యాండ్ కారవ్యాన్ ని ఉపయోగిస్తున్నారు. ఇది కూడా చరణ్ ఉపయోగిస్తున్న కారవ్యాన్ తరహానే ఖరీదైనదే. అలానే బన్ని సొంతంగా ఓ కారవ్యాన్ ని ఉపయోగిస్తున్నారు.
మహేష్ సైతం ఇదివరకూ ఓ ఖరీదైన కారవ్యాన్ సొంతం చేసుకున్నారు. `సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు` షూటింగ్ టైమ్ లో కారవ్యాన్ కొనుక్కున్నారు. తెలుగు - తమిళ్ - కన్నడలో ఇంత స్పెషాలిటీ కారవ్యాన్ వేరే ఎవరికీ లేదట. ఇక డార్లింగ్ ప్రభాస్ సొంతంగా కారవ్యాన్ మెయింటెయిన్ చేయడట. ఇప్పటివరకూ కొనుక్కోలేదని - ఇకపై కొనుక్కునే ఆలోచన చేయొచ్చని చెబుతున్నారు. మన స్టార్ హీరోల కారవ్యాన్ మెయింటెనెన్స్ తక్కువేం కాదు. నెలవారీగా బాగానే ఖర్చు అవుతుంటుంది. ఇండియాలో ఎక్కడ షూట్ అయినా అక్కడికి కారవ్యాన్ రెండ్రోజుల ముందే వెళ్లి రెడీగా ఉండాలి. లోకల్ గా అయినా చాలా ముందే కారవ్యాన్ వెయిట్ చేయాలి. కారవ్యాన్ డ్రైవర్ కి రోజుకు రూ.3000-5000 భత్యం - అదనంగా బేటా చెల్లించాల్సి ఉంటుంది. ఔట్ డోర్ లొకేషన్లలో షూటింగ్ అయితే అక్కడ స్టార్ హోటల్ నుంచి హీరో నేరుగా లొకేషన్ కి వచ్చినప్పుడు కారవ్యాన్ ఉపయోగిస్తుంటారు.