Begin typing your search above and press return to search.
#సలార్.. ప్రభాస్ ఎలివేషన్ ఆ లెవల్లో
By: Tupaki Desk | 22 May 2021 11:30 AM GMTడార్లింగ్ ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ 10 రోజుల చిత్రీకరణ పెండింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. కొద్దిరోజుల్లో పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. మరోవైపు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ `సలార్`లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మాఫియా డాన్ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం మొదటి షెడ్యూల్ పూర్తయింది. హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్ ని దర్శకుడు తెరకెక్కిస్తున్నారు. త్వరలోనే హైదరాబాద్ లో షూటింగ్ తిరిగి ప్రారంభమవుతుంది.
ఈ చిత్రంలో ప్రభాస్ డాన్ పాత్ర ఎలివేషన్ ని ప్రశాంత్ చాలా ప్రత్యేకంగా డిజైన్ చేశారు. యాక్షన్ ఎపిసోడ్లలో ప్రభాస్ సిక్స్ ప్యాక్ రూపాన్ని ప్రదర్శిస్తారని తెలుస్తోంది. త్వరలో చిత్రీకరించబోయే యాక్షన్ ఎపిసోడ్ కోసం డార్లింగ్ షర్ట్ లెస్ లో కనిపిస్తాడు. సలార్ అద్భుతమైన అంచనాలను కలిగి ఉంది. ఈ చిత్రం 2022 సమ్మర్ లో విడుదల కానుంది. శ్రుతి హాసన్ ఈ చిత్రంలో కథానాయికగా నటించనుంది. హోంబలే ఫిల్మ్స్ ఈ పాన్-ఇండియన్ ప్రాజెక్ట్ ను నిర్మిస్తోంది. ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ కోసం ప్రభాస్ షూటింగ్ చేస్తున్నారు.
రాధేశ్యామ్ ని జూలై 30న రిలీజ్ చేయాలంటే పది రోజుల పెండింగ్ చిత్రీకరణను పూర్తి చేయాల్సి ఉంది. ఇప్పుడు రిస్క్ చేసి అయినా అది పూర్తి చేయాలన్నది ప్లాన్. రాధే శ్యామ్ బృందం జూన్ 2 వ వారం నాటికి ఒక పాట కొన్ని సన్నివేశాలను పూర్తి చేయాలని యోచిస్తోంది. ఇంకా చాలా VFX పూర్తి చేయాల్సి ఉంది కాబట్టి వారికి పోస్ట్ ప్రొడక్షన్ పనులకు సమయం ఉంటుంది. ఏదేమైనా కోవిడ్ కేసులు తగ్గితే మాత్రమే విడుదల తేదీని ప్రకటిస్తారు.