Begin typing your search above and press return to search.
ప్రభాస్ ఫ్యాన్ సూసైడ్ నిజమా కాదా?
By: Tupaki Desk | 8 Oct 2018 7:10 AM GMTఆత్మహత్యను ఎవరూ సమర్థించరు. మతాలు కానీ.. మతం పేరెత్తితే మండిపడే మానవతావాదులు కానీ ఎవరూ సూసైడ్ కు మద్దతు ఇవ్వరు... కానీ ఎందుకో కొన్ని సంఘటనల్లో ఆత్మహత్యను 'బలిదానం'.. 'ఆత్మత్యాగం' అని గ్లోరిఫై చెయ్యడం వాటిని రాజకీయాలకు వాడుకోవడం చూస్తూనే ఉన్నాం. ఇదెంత సున్నితమైన సమస్య అంటే కొందరు ఆత్మ బలిదానం అని నమ్మే సంఘటనలను కనుక ఎవరైనా మరో కోణం లో 'అత్మహత్య తప్పు..పోరాటం చెయ్యాలి కానీ ఆత్మహత్య ముమ్మాటికి తప్పు' అని చెప్తే వాడ్ని చీల్చి చెండాడే వరకూ కొందరు నిద్రపోరు. సోమవారం ఉదయాన్నే ఈ అత్మహత్య టాపిక్ ఎందుకు వచ్చిందటే సోషల్ మీడియా లో వైరల్ అయిన ప్రభాస్ ఫ్యాన్ సూసైడ్ నోట్.
కృష్ణ అనే పేరున్న అబ్బాయి 'సాహో' సినిమా అప్డేట్ లు రాకపోవడం తో మనస్తాపం చెందాడట. యూవీ క్రియేషన్స్ వారిని.. సుజిత్ ని ఎన్ని సార్లు అడిగినా సినిమా కు సంబంధించిన అప్డేట్లు ఇవ్వడం లేదని.. విరక్తితో ఆత్మహత్య చేసుకుంటున్నానని ఒక లేఖ రాశాడు. దీనికి కారణం యూవీ క్రియేషన్స్ వారు.. సుజిత్.. ఎస్కేఎన్ అని క్లియర్ గా చెప్పాడు. మరి ఆ కృష్ణ పేరుతో ఉన్న అబ్బాయి నిజంగా ఆత్మహత్య చేసుకున్నాడా? లేదా ఇది జస్ట్ ఒక ఫేక్ సూసైడ్ నోటా అనే విషయంపై ఇకా క్లారిటీ లేదు. ఏదేమైనా లెటర్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఈ సూసైడ్ నోట్ ఫేక్ అయి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఎందుకంటే ఇలాంటివి ఇన్స్పిరేషన్ గా తీసుకునే మ్యాడ్ ఫ్యాన్స్ చాలామంది హీరోలకు లక్షల్లో ఉన్నారు. అందరూ 'నాకు ఈరోజు సాయంత్రం నాలుక్కి టీజర్ కావాలి.. లేదా సూసైడ్".. రేపు రాత్రికి ఎనిమిదిన్నరకి ఫస్ట్ లుక్ కావాలి.. లేదా ఆత్మహత్యే'.. అని హంగామా మొదలు పెడితే స్టార్ హీరోలకు ఇదో పెద్ద తలనొప్పిగా మారుతుంది.