Begin typing your search above and press return to search.
ఆ విషయంలో ప్రభాస్ ఫ్యాన్స్ బాగా డిజప్పాయింట్ అవుతున్నారట..!
By: Tupaki Desk | 5 Aug 2022 5:30 PM GMTయంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. 'బాహుబలి' సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ డమ్ సంపాదించిన డార్లింగ్.. దాన్ని కాపాడుకోడానికి కృషి చేస్తున్నారు. 'సాహో' 'రాధే శ్యామ్' వంటి చిత్రాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వనప్పటికీ.. ఏమాత్రం డీలా పడకుండా ముందుకు సాగుతున్నారు.
ప్రభాస్ లైనప్ లో ప్రస్తుతం భారీ బడ్జెట్ తో రూపొందే ఐదు సినిమాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా వేటికవే ప్రత్యేకమైన జోనర్స్ లో తెరకెక్కే చిత్రాలే కావడం విశేషం. ఇదంతా బాగానే ఉంది కానీ.. అన్ని సినిమాలలోనూ డార్లింగ్ దాదాపు ఒకే విధమైన లుక్ లో కనిపిస్తుండటమే ఫ్యాన్స్ ను నిరుత్సాహానికి గురి చేస్తోంది.
బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ ''ఆది పురుష్'' వంటి మైథలాజికల్ మూవీలో నటిస్తున్నారు. రామాయణ ఇతిహాసం ఆధారంగా రూపొందే ఈ చిత్రంలో అతను రాఘవ పాత్రలో కనిపించనున్నారు. దీని కోసం మోషన్ క్యాప్చర్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారని తెలుస్తోంది.
అలానే 'కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ''సలార్'' వంటి హై వోల్టేజ్ యాక్షన్ మూవీలో నటిస్తున్నారు ప్రభాస్. ఇందులో అతన్ని మోస్ట్ వైలెంట్ మ్యాన్ గా ప్రెజెంట్ చేయబోతున్నట్లు మేకర్స్ చెబుతున్నారు. అలానే 'మహానటి' ఫేమ్ నాగ్ అశ్విన్ తో ''ప్రాజెక్ట్ K'' వంటి సైన్స్ ఫిక్షన్ మూవీలో నటిస్తున్నారు.
ఇదే క్రమంలో మారుతి దర్శకత్వంలో ఓ మాస్ మసాలా కమర్షియల్ ఎంటర్టైనర్ మరియు సందీప్ వంగా తో 'స్పిరిట్' వంటి యాక్షన్ మూవీ చేయనున్నారు ప్రభాస్. అయితే వీటిల్లో 'ఆదిపురుష్' తప్ప మిగతా సినిమాలన్నింటిలోనూ ప్రభాస్ లుక్స్ చాలా సిమిలర్ గా ఉంటాయనే చర్చ ఇప్పుడు నెట్టింట జరుగుతోంది.
నిజానికి ప్రభాస్ లైన్ లో పెట్టిన పెట్టినవన్నీ ఒక దానితో ఒకటి సంబంధంలేని జోనర్ సినిమాలు. ఒక్కో సినిమాలో ఒక్కో రకమైన గెటప్ లో కనిపించడానికి అవకాశం లభిస్తుంది. కానీ ప్రభాస్ మాత్రం వీటోల్లో ఒకే విధమైన లుక్ లో కనిపిస్తారట. కేవలం తన కాస్ట్యూమ్స్ మరియు స్టైలింగ్ లోనే వెరీయేషన్ చూపిస్తారని అంటున్నారు.
'సాహో' మరియు 'రాధే శ్యామ్' చిత్రాలలో ప్రభాస్ సిమిలర్ లుక్ లోనే కనిపించారు. అందుకే తమ అభిమాన హీరోని కొత్తగా చూడాలని ఫ్యాన్స్ ఆశ పడుతున్నారు. అయితే ప్రభాస్ ఒకేసారి నాలుగు సినిమాల షూటింగ్స్ చేస్తుండటం వల్ల ఆ అవకాశం లేకుండా పోతుందని తెలుస్తోంది. కాకపోతే సీజీ తో ఏదైనా మ్యాజిక్ చేసి కొత్తగా చూపించే ప్రయత్నాలు చేసే ఛాన్స్ ఉందని అనుకుంటున్నారు.