Begin typing your search above and press return to search.

నెట్ ఫ్లిక్స్ పై ప్రభాస్ ఫ్యాన్స్ అసంతృప్తి..!

By:  Tupaki Desk   |   24 Oct 2022 9:33 AM GMT
నెట్ ఫ్లిక్స్ పై ప్రభాస్ ఫ్యాన్స్ అసంతృప్తి..!
X
ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ పై రెబల్ స్టార్ ఫ్యాన్స్ అసంతృప్తిగా ఉన్నారు. అలా ఎందుకు అంటే ఆదివారం ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా నెట్ ఫ్లిక్స్ బర్త్ డే విషెస్ చెబుతూ ఒక ఫోటో షేర్ చేసింది. ఆ ఫోటోలో ప్రభాస్ బాహుబలి ఫోటోని వాడేశారు.

వాడితే వాడారు కానీ అందులో బాహుబలి క్లైమాక్స్ ఫైట్ లో ప్రభాస్ భళ్లాలదేవ మీద వేసేందుకు ఒక రాయిని పై ఎత్తుతాడు. ఆ ప్లేస్ లో కేక్ ని పెట్టి విషెస్ అందించింది నెట్ ఫ్లిక్స్. ఈ ఫోటోపై ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. నెట్ ఫ్లిక్స్ కావాలనే బాలీవుడ్ హీరోల మెప్పు పొందేందుకు ప్రభాస్ ని ఇలా చూపించారని. బర్త్ డే విషెస్ తో నెట్ ఫ్లిక్స్ ప్రభాస్ ని ఎగతాళి చేసిందని ఫ్యాన్స్ అంటున్నారు.

సౌత్ హీరోల మీద నెట్ ఫ్లిక్స్ అక్కసు చూపిస్తుందని ఇన్నర్ టాక్. కేవలం బాలీవుడ్ సినిమాలు మాత్రమే నెట్ ఫ్లిక్స్ లో ఎక్కువ వస్తున్నాయి. వారికి మాత్రమే అందులో ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. తెలుగు సినిమాలు ఒకటి అరా మాత్రమే నెట్ ఫ్లిక్స్ లో వస్తున్నాయి.

ప్రస్తుతం ప్రపంచం మొత్తం తెలుగు సినిమా మీద ఫోకస్ పెడుతుంది. అలాంటిది నెట్ ఫ్లిక్స్ మన పాన్ ఇండియా స్టార్ మీద వెరైటీ పోస్టర్ వేసి ఫ్యాన్స్ ఆగ్రహానికి గురవుతున్నారు. ఇక మీదట నెట్ ఫ్లిక్స్ ఇలాంటి పనులు చేయకుండా ఉంటే బెటర్ అని సినీ ప్రియులు అంటున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా నెట్ ఫ్లిక్స్ కి చాలా మంచి ఫిగర్ లో సబ్ స్క్రైబర్స్ ఉన్నారు. అలాంటిది తెలుగు హీరోల మీద నెట్ ఫ్లిక్స్ ఇలాంటి కామెడీ చేయొద్దని ఫ్యాన్స్ కోరుతున్నారు.

ఒక తెలుగు హీరోగా కెరియర్ మొదలు పెట్టి నేషనల్ లెవల్ లో స్టార్ డం తెచ్చుకున్న ప్రభాస్ పట్ల నెట్ ఫ్లిక్స్ మరీ ఇంత నెగ్లెక్ట్ గా ప్రవర్తించడం ఏంటని ఫ్యాన్స్ సీరియస్ గా ఉన్నారు. నెట్ ఫ్లిక్స్ నిజంగా కావాలనే ప్రభాస్ పోస్టర్ డిజైన్ చేసిందా లేక వారు పాజిటివ్ గానే ఈ ఫోటో పెట్టారా అన్నది తెలియాల్సి ఉంది. నెట్ ఫ్లిక్స్ క్రియేటివ్ టీం మీద కూడా ప్రభాస్ ఫ్యాన్స్ జోకులు వేస్తున్నారు. వారి టీం ఇక మీదట ఇలాంటి తప్పిదాలు చేయకుండా ఉంటే బెటర్ అని చెప్పొచ్చు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.