Begin typing your search above and press return to search.

కోవిడ్ నీ కేర్ చేయ‌క ప్ర‌భాస్ ఇంటిని రౌండ‌ప్ చేశారిలా

By:  Tupaki Desk   |   23 Oct 2020 3:00 PM GMT
కోవిడ్ నీ కేర్ చేయ‌క ప్ర‌భాస్ ఇంటిని రౌండ‌ప్ చేశారిలా
X
డార్లింగ్ ప్ర‌భాస్ క్రేజు గురించి ప్ర‌త్యేకించి చెప్పాలా? ఎక్క‌డో విదేశాల నుంచి వ‌చ్చి హైద‌రాబాద్ లో అత‌డి ఇంటి ముందు నిల‌బ‌డిన విదేశీయుల ఫోటోలు ఎన్నో ఇంత‌కుముందు వైర‌ల్ అయ్యాయి. బాహుబ‌లి ని క‌నులారా చూడాల‌ని విచ్చేసిన అభిమానులు కోకొల్ల‌లు.

ఈరోజు ప్ర‌భాస్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా కోవిడ్ ని కూడా కేర్ చేయ‌క ఇదిగో ఇలా ప్ర‌భాస్ ఇంటిని రౌండ‌ప్ చేశారు. ప్ర‌భాస్ మానియా ఏ రేంజులో ఉందో ఈ ఇన్సిడెంట్ చెబుతోంది. పాన్-ఇండియన్ స్టార్ గా అత‌డి స్థాయిని ఎలివేట్ చేస్తోంది ఈ ఘ‌టన‌‌.

ఇంత‌కుముందు రిలీజైన ‘రాధే శ్యామ్’ కొత్త లుక్ కి అద్భుత స్పంద‌న వ‌చ్చింది. ప్ర‌భాస్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. అయినా అభిమానులు ఇదిగో ఇలా ఇంటికి వ‌చ్చేశారు. మ‌రోవైపు ఇరు తెలుగు రాష్ట్రాలు స‌హా ప్ర‌పంచవ్యాప్తంగా ఈరోజు డార్లింగ్ అభిమానులు బ‌ర్త్ డే సంబ‌రాలు జ‌రుపుకున్నారు.

ఆశ్చర్యకరంగా ప్ర‌భాస్ అభిమానుల్ని చుట్టుముట్టిన‌ డై-హార్డ్ అభిమానులలో కొంతమంది మహిళా అభిమానులు ఉన్నారు. ప్ర‌స్తుతం ఈ ఫ్యానిజం సోషల్ మీడియా ‌లలో వైర‌ల్ గా మారింది. నాగ్ అశ్విన్ తో సైన్స్ ఫిక్ష‌న్ మూవీ.. మ‌రోవైపు ఓంరౌత్ తో ఆదిపురుష్ 3డి ప్ర‌భాస్ ఇమేజ్ ని మ‌రింత పెద్ద లెవల్ కి తీసుకెళ‌తాయ‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. రాధే శ్యామ్ అత‌డి కెరీర్ లో మ‌రో స్పెష‌ల్ మూవీగా నిలుస్తుంద‌ని అభిమానులు భావిస్తున్నారు.