Begin typing your search above and press return to search.

'ప్ర‌భాస్ తో ఐట‌మ్ సాంగ్ చేయించు మారుతి 'బ్రో'

By:  Tupaki Desk   |   26 Dec 2022 10:33 AM GMT
ప్ర‌భాస్ తో ఐట‌మ్ సాంగ్ చేయించు మారుతి బ్రో
X
ప్ర‌భాస్ పాన్ ఇండియా స్టార్ అయిన త‌ర్వాత మాస్ ఆడియ‌న్స్ కి కాస్త దూర‌మైన‌ట్లే క‌నిపిస్తుంది. కంటెంట్ ప‌రంగా యూనివ‌ర్శల్ అప్పీల్ చూసుకోవ‌డంతో? ఓ సెక్ష‌న్ ఆడియ‌న్స్ కి డార్లింగ్ దూర‌మ‌వుతున్నాడు. 'బాహుబ‌లి'..'సాహో'..'రాధేశ్యామ్' లాంటి సినిమాల్లో మ‌సాలా పాట‌లు ఎక్క‌డా క‌నిపించ‌వు. వాటిలో క‌థ ఆధారంగా వ‌చ్చే పాట‌లు త‌ప్ప క‌మ‌ర్శియ‌ల్ కోణంలో చూడ‌టానికి ఆస్కారం లేదు.

ప్ర‌స్తుతం ప్ర‌భాస్ న‌టిస్తోన్న 'ఆదిపురుష్‌'...'స‌లార్'...'ప్రాజెక్ట్ -కె' లాంటి చిత్రాలు అదే కోవ‌కు చెందుతాయి. కాబ‌ట్టి వాటిలోనూ ఐటం సాంగ్ ల‌కు గ‌ట్రా ఛాన్స్ లేదు. ఈ విష‌యాన్ని అభిమానులు ముందే గెస్ చేసిన‌ట్లున్నారు. అందుకే ఇలా మారుతి వెంట ప‌డుతున్న‌ట్లు క‌నిపిస్తుంది. మారుతి ద‌ర్శ‌క‌త్వంలో డార్లింగ్ 'రాజా డీల‌క్స్' సినిమా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే.

హార‌ర్ కామెడీ నేప‌థ్యంతో సాగే స్టోరీ ఇది. అన్ని ర‌కాల అంశాల‌కు తావు ఉన్న క‌థ కూడా. దీంతో డార్లింగ్ అభిమానులు మారుతి ముందు నుంచే వేడుకోవ‌డం మొద‌లు పెట్టారు. మారుతి బ్రో సినిమాలో మంచి ఐటం సాగ్ ఒక‌టి పెట్టు. అందులో డార్లింగ్ స్టెప్పులు ఇర‌గ దీయాలి...'న‌చ్చా వే నైజం పోరీ' టైపులో....థియేట‌ర్ బాక్సులు బ‌ద్ద‌లైపోవాంల‌టూ కోరుతున్నారు.

అలాగే మాకు రొమాన్స్ కూడా కావాలి బ్రో అంటూ ప‌నిలో ప‌నిగా కోరేస్తున్నారు. రొమాంటిక్ స‌న్నివేశాల‌కు ప్ర‌భాస్ కొంత కాలంగా దూరంగానే ఉంటున్నాడు. క‌థ‌లు డిమాండ్ చేయ‌క‌పోవ‌డంతో ఫ్యాన్స్ కి హీటెక్కించే స‌న్నివేశాలు పెద్ద‌గా క‌నిపించ‌డం లేదు.

అవ‌న్నీ మారుతి సినిమాలో పెట్ట‌డానికి స్కోప్ ఉంది కాబ‌ట్టి ఇలా రిక్వెస్ట్ చేస్తున్నారు. మారుతి....ప్ర‌భాస్ షూట్ లో ఉన్న ఓ ఫోటో..వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది. అది చూడ‌గానే అభిమానుకు ఇలా త‌మ సందేహాల‌న్ని త‌న్నుకుంటు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. మ‌రి ఫ్యాన్స్ కోరిక‌ను మారుతి నెర‌వేరుస్తాడో? లేదో? చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.