Begin typing your search above and press return to search.

'బ్లాక్‌' గొడవ.. దిల్‌రాజుపై కేసు?!

By:  Tupaki Desk   |   9 July 2015 3:26 PM GMT
బ్లాక్‌ గొడవ.. దిల్‌రాజుపై కేసు?!
X
ప్రభాస్‌-రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కిన 'బాహుబలి' విడుదలకు ముందే సంచలనాలు నమోదు చేస్తోంది. ఈ సినిమా టిక్కెట్ల కోసం అభిమానులు వెర్రెత్తిపోతున్నారు. ఆన్‌లైన్‌లో టిక్కెట్లు దొరకని పరిస్థితి. కొన్ని బుకింగ్‌లు ఇప్పటికే మూతపడ్డాయి. డైరెక్టుగా థియేటర్లకు వెళ్లి కొనాలంటే టిక్కెట్లు లేవన్న సమాధానం వినిపిస్తోంది. మల్లీప్లెక్సు, సాధారణ థియేటర్‌ అనే తేడా లేకుండా టిక్కెట్లను భారీ మొత్తాలకు బ్లాక్‌లో అమ్మించేస్తున్నారని టాక్‌..

మామూలు సాదాసీదా థియేటర్‌లో టాప్‌ క్లాస్‌ రూ.70ల టిక్కెట్‌ ధర ఉంటే దానిని బ్లాక్‌లో రూ.200కు అమ్మేస్తున్నారు. అలాగే మల్టీప్లెక్సుల్లో రూ.150 టికెట్‌ను రూ.1000 మొత్తానికి విక్రయిస్తున్నారు. సామాన్య జనాలు సైతం ఇంత పెద్ద మొత్తాల్ని వెచ్చించడానికి ఎగబడుతుంటే థియేటర్‌ యాజమాన్యం సైతం బ్లాక్‌లో అమ్మించే ప్రయత్నం చేస్తున్నారట. ఏదో ఒకరకంగా అభిమానుల్లో ఉన్న క్రేజును క్యాష్‌ చేసుకోవడానికి బ్లాక్‌లో టిక్కెట్లు అమ్మేయడం ఎంతవరకూ కరెక్ట్‌? అంటూ.. ప్రభాస్‌ అభిమానులు చాలా సీరియస్‌ అయ్యారని తెలుస్తోంది.

ఈ చిత్రాన్ని నైజాంలో పంపిణీ చేస్తున్న దిల్‌రాజుపై ప్రభాస్‌ అభిమాన సంఘం కేసు పెట్టిందని వార్తలొస్తున్నాయి. పంపిణీదారుడే స్వయంగా బ్లాక్‌ మార్కెట్‌ను ఎంకరేజ్‌ చేస్తున్నారని అభిమానులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే బెనిఫిట్‌ షోల రూపంలో దిల్‌రాజు కోటి మొత్తాన్ని వెనకేసుకున్నారని చెబుతున్నారు. పైరసీని అదుపులో పెట్టడానికి తమవంతు సాయం చేస్తున్నా ఇలా టిక్కెట్లను బ్లాక్‌లో అమ్మేయడం ఏమిటి అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు