Begin typing your search above and press return to search.

కృతి - వరుణ్ లపై ఫైర్ అవుతున్న డార్లింగ్ ఫ్యాన్స్..!

By:  Tupaki Desk   |   30 Nov 2022 3:30 PM GMT
కృతి - వరుణ్ లపై ఫైర్ అవుతున్న డార్లింగ్ ఫ్యాన్స్..!
X
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మరియు బాలీవుడ్‌ బ్యూటీ కృతి సనన్‌ ప్రేమలో ఉన్నారనే వార్తలు గత కొన్ని రోజులుగా చక్కర్లు కొడుతోన్న విషయం తెలిసిందే. వీరిద్దరూ "ఆదిపురుష్" సినిమాలో కలిసి నటిస్తుండటంతో ఈ రూమర్స్ ప్రచారంలోకి వచ్చాయి. దీనికి హీరో వరుణ్‌ ధావన్‌ చేసిన కొన్ని వ్యాఖ్యలు మరింత బలం చేకూర్చాయి.

'తోడేలు' మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల వరుణ్ ధావన్ మరియు కృతి సనన్ ఓ షోకి సెలబ్రిటీ గెస్టులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హిందీ ఇండస్ట్రీ నుండి కొంతమంది ఎలిజిబుల్ సింగిల్ మహిళల పేర్ల గురించి చెప్పమని కరణ్ జోహార్ అడగ్గా.. కృతి సనన్ ఆల్రెడీ ప్రేమలో ఉందనే విధంగా వరుణ్ మాట్లాడాడు.

ఇప్పుడు కృతి మదిలో ఒకరు వున్నారు. అతను ఇప్పుడు ముంబైలో లేడు. దీపికాతో షూటింగ్ లో ఉన్నాడు అని వరుణ్ ధావన్ కామెంట్ చేశాడు. 'ప్రాజెక్ట్ K' లో ప్రభాస్ - దీపికా కలిసి నటిస్తున్నారు కాబట్టి.. అందరూ కృతి తో డార్లింగ్ డేటింగ్ చేస్తున్నారని భావించారు.

అంతేకాకుండా ప్రభాస్‌ అంటే తనకు ఇష్టమని గతంలో కృతి సనన్ చేసిన వ్యాఖ్యలను కూడా దీనికి కనెక్ట్ చేసుకున్నారు. దీంతో ప్రభాస్ - కృతి వ్యవహారం టాలీవుడ్‌ నుంచి బాలీవుడ్‌ వరకూ ఫిలిం సర్కిల్స్‌ లో హాట్‌ టాపిక్‌ గా మారింది. ఈ నేపథ్యంలో కృతి సనన్‌ తన డేటింగ్ రూమర్స్ పై ఎట్టకేలకు ఓపెన్‌ అయ్యింది.

ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ‘ఇది ప్రేమ కాదు.. అలాగని పీఆర్ స్టంట్ కూడా కాదు. మా భేడియా అంటే వరుణ్ ధావన్ ఆ రియాలిటీ షోలో కాస్త కావాలని ఇలా మాట్లాడాడు. అతని సెటైర్ ఎక్కడికో దారితీసి అనేక రకాల పుకార్లకు తావిస్తోంది. వెబ్‌ సైట్స్‌ మా పెళ్లి తేదీ కూడా ప్రకటించక ముందే నేను ఈ విషయం మీద క్లారిటీ ఇవ్వాలని అనుకుంటున్నాను. ఇవన్నీ ఎలాంటి ఆధారాలు లేని పుకార్లు మాత్రమే’ అని కృతి స్పష్టత ఇచ్చింది. ఫేక్ న్యూస్ స్టిక్కర్ జత చేసింది.

అయితే తాజాగా వరుణ్ ధావన్ సైతం ఈ విషయం మీద స్పందించారు. కృతి సననన్ చేసిన పోస్టుపై స్పందిస్తూ.. ఇది జస్ట్ ఫన్ అని కామెంట్ చేశాడు. మేము దానిని ఫన్ గా తీసుకున్నాం. మీ ఇమాజినేషన్ మరీ అంత వైల్డ్ గా నడవనివ్వకండి అన వరుణ్ పేర్కొన్నారు.

ఇప్పుడు కృతి సనన్ మరియు వరుణ్ ధావన్ చేసిన పోస్టుల స్క్రీన్ షాట్స్ ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. అయితే దీనిపై డార్లింగ్ ఫ్యాన్స్ సీరియస్ గా వున్నారు. అలాంటి కామెంట్లు చేయడం ఎందుకు.. మళ్ళీ ఇలా పోస్టులు పెట్టడం ఎందుకని అంటున్నారు. మూవీ ప్రమోషన్స్ కోసం అనవసరంగా ప్రభాస్ చుట్టూ మీరే గాసిప్ క్రియేట్ చేసి.. మళ్ళీ ఇలా డ్రామాలు ఆడుతున్నారా? అంటూ మండిపడుతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.