Begin typing your search above and press return to search.
ప్రభాస్ ఫ్యాన్స్ అంచనాలను ఆయన రీచ్ అయ్యేనా?
By: Tupaki Desk | 10 Nov 2020 1:10 PM GMTప్రభాస్ హీరోగా రూపొందబోతున్న 'ఆదిపురుష్' సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. కేవలం తెలుగు ప్రేక్షకులు అభిమానుల్లో మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానుల్లో ఆదిపురుష్ ఎలా ఉంటుందా అనే ఆసక్తి కనిపిస్తుంది. సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించబోతున్నాడు అంటూ ఇప్పటికే అంతా చాలా బలంగా నమ్మకంగా అనుకున్నారు. ఇలాంటి సమయంలో ఆయన లుక్ ఇలా ఉంటుంది అలా ఉంటుంది అంటూ ఫ్యాన్స్ చాలా నమ్మకాలు పెంచుకుంటున్నారు. తాజాగా ఒక ఫ్యాన్ మేడ్ ప్రభాస్ పోస్టర్ ఏ స్థాయిలో వైలర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
దర్శకుడు ఓం రౌత్ కూడా ఆ పోస్టర్ కు ఫిదా అయ్యాడు. ఆ పోస్టర్ ను చూస్తుంటే నిజంగా ఆదిపురుష్ లో ప్రభాస్ ఇలా ఉంటాడా అంటూ అభిమానులు ఎదురు చూస్తున్నారు. సినిమాలో ఒక వేళ ప్రభాస్ అలా లేకుంటే ఖచ్చితంగా ఫ్యాన్స్ ఒప్పుకోరేమో అనిపిస్తుంది. మొత్తానికి ప్రభాస్ ను సినిమాలో ఆకాశమే హద్దుగా ఊహించుకుంటున్న ఫ్యాన్స్ కు దర్శకుడు ఓం రౌత్ నుండి ఎలాంటి ఔట్ పుట్ వస్తుంది. ఇంతకు వారిని మెప్పించడంలో దర్శకుడు ఓం రౌత్ ఎంత మేరకు వర్కౌట్లు చేస్తున్నాడు అనేది చూడాలి.
ప్రభాస్ నటిస్తున్న మొదటి బాలీవుడ్ సినిమా అవ్వడంతో పాటు రామాయణం బ్యాక్ డ్రాప్ అవ్వడం వల్ల సినిమాపై అంచనాలు ఉన్నాయి. ఒక వైపు అయోద్యలో రామాలయం నిర్మాణం జరుగుతుంది. ఇలాంటి సమయంలో ఆదిపురుష్ సినిమా తెరకెక్కడం వల్ల ఖచ్చితంగా సెంటిమెంట్ వర్కౌట్ అయ్యే అవకాశం ఉంటుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది.