Begin typing your search above and press return to search.

ఆదిపురుష్ లో సలార్.. కటౌట్ అదిరింది!

By:  Tupaki Desk   |   26 May 2023 5:00 PM
ఆదిపురుష్ లో సలార్.. కటౌట్ అదిరింది!
X
స్టార్ హీరో సినిమా అంటే ఫ్యాన్స్ ఉత్సాహం మామూలుగా ఉండదు. మూవీ ఎనౌన్స్మెంట్ ఇచ్చినప్పటి నుంచి తమ హీరో అలా ఉంటాడు, ఇలా ఉంటాడు అని ఊహించుకుంటారు. టైటిల్ ఏదైతో బాగుంటుందో కూడా వాళ్లే ముందుగా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. కొందరు ముందుగా మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ లు కూడా ఎడిట్ చేసి విడుదల చేస్తూ ఉంటారు. నిజానికి చాలా మంది ఫ్యాన్స్ రియల్ లుక్ కన్నా కూడా ఫ్యాన్ మేడ్ లుక్ ని చాలా బాగా ఎడిట్ చేస్తారు. అలాంటి సంఘటనలు గతంలో చాలానే జరిగాయి.

తాజాగా, ప్రభాస్ ఫ్యాన్ ఓ పోస్టర్ రిలీజ్ చేసారు. ఈ ఫ్యాన్ మేడ్ పోస్టర్ అదిరిపోయింది. ప్రభాస్, సలార్ రెండు మూవీల్లోని ప్రభాస్ లుక్ ని కలిపి ఈ పోస్టర్ రిలీజ్ చేయడం విశేషం. ఒక వైపు ఆదిపురుష్ లోని రాముడు, మరోవైపు సలార్ లోని ప్రభాస్ లుక్, రెండింటినీ కలిపి ఎడిట్ చేసిన విధానం ఇప్పుడు మిగిలిన ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటోంది. కటౌట్ అదిరింది అంటూ కామెంట్స్ పెడుతున్నారు..

గతంలో ఆదిపురుష్ మూవీ ఎనౌన్స్ చేసినప్పడు కూడా కొన్ని ఫ్యాన్ మేడ్ పోస్టర్లు వచ్చాయి. నిజం చెప్పాలంటే, ఇప్పుడు ఆదిపురుష్ లో డైరెక్టర్ ఓం రావత్ చూపిస్తున్న ప్రభాస్ కన్నా కూడా.. ఫ్యాన్ మేడ్ పోస్టర్ లో ప్రభాస్ లుక్ చాలా అద్భుతంగా ఉంది. అలా చూపించి ఉంటే మరింత బాగుండేది అని ఫ్యాన్స్ అభిప్రాయపడ్డారు.

ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా విడుదలకు సిద్దమైంది. జూన్ 16వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ విడుదల రోజే సలార్ టీజర్ కూడా విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈ మేరకు సలార్ టీమ్ అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది. ఇది నిజంగా ఫ్యాన్స్ కి డబుల్ ట్రీట్ లాంటిది. ఈ విషయం తెలియడంతోనే ఫ్యాన్స్ అలా ఆదిపురుష్ లో సలార్ కటౌట్ డిజైన్ చేయడం విశేషం.

ఇదిలా ఉండగా, సలార్ మూవీ ఈ ఏడాది సెప్టెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీలో శృతిహాసన్ ప్రభాస్ కి జోడిగా కనిపించనుంది.