Begin typing your search above and press return to search.
సాహో కోసం ఎంత కష్టపడుతున్నాడో
By: Tupaki Desk | 30 Dec 2017 4:30 AM GMTప్రభాస్ సాహో సినిమా ఇంకా సగమైనా పూర్తయ్యిందో లేదో గాని సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వాటిపై కథనాలు ఏ మాత్రం తగ్గేలా లేవు. బాహుబలి సినిమాతో ఒక్కసారిగా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ నెక్స్ట్ ఎలాగైనా మళ్లీ తన రెగ్యులర్ ఫార్మాట్ లో హిట్ కొట్టాలని అనుకుంటున్నాడు. సాహో సినిమా మొదలై కొన్ని నెలలు కావొస్తోంది. అయితే షూటింగ్ మాత్రం కాస్త నెమ్మదిగానే సాగుతోంది.
అంతే కాకుండా అనుకున్న డేట్స్ లలో దర్శకుడు షెడ్యూల్స్ ని పూర్తి చేయడం లేదని తెలుస్తోంది. నెక్స్ట్ వీక్ దుబాయ్ లో ప్రభాస్ కొన్ని పోరాట సన్నివేశాల్లో పాల్గొననున్నాడు. అయితే ఆ యాక్షన్ సీన్స్ కోసం బాడీని పర్ఫెక్ట్ గా పెంచుకోవడం కోసం గత నెల రోజుల నుంచి లాస్ ఏంజిల్స్ లో శిక్షణ తీసుకున్నాడు. ఎక్కువగా ఆ సీన్స్ కోసం వర్క్ షాప్ నిర్వహించారట. ఇక ప్రభాస్ బాడీని కూడా చాలా వరకు కొత్తగా మార్చుకున్నాడని తెలుస్తోంది.
మరికొన్ని రోజుల్లో అంటే జనవరి ఫస్ట్ వీక్ లోనే దుబాయ్ వెళ్లి అక్కడ ప్రముఖ ప్రదేశాల్లో భారీ యాక్షన్ సీన్స్ ని చిత్రీకరించాలని షెడ్యూల్ ని సెట్ చేసుకున్నారు. వీలైనంత త్వరగా ఆ షెడ్యూల్ ని పూర్తి చేసి మళ్లీ హైదరాబాద్ లో మరొక షెడ్యూల్ ని స్టార్ట్ చేయనున్నారు. ఇక ఈ సినిమాకు సుజిత్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. శ్రద్ధ కపూర్ ప్రభాస్ కు జోడిగా కనిపించనుంది.