Begin typing your search above and press return to search.
షాక్: 100 కోట్ల డీల్ లైట్ తీస్కున్న ప్రభాస్
By: Tupaki Desk | 11 March 2021 4:15 AM GMTడార్లింగ్ ప్రభాస్ 100 కోట్ల పే-చెక్ ని తిరస్కరించారా? అగ్ర బ్యానర్లు తనతో సినిమా చేసేందుకు అడ్వాన్స్ ఇవ్వదలిస్తే లైట్ తీస్కున్నారా? అంటే .. అవుననే గుసగుసలు వినిపిస్తున్నాయి. అతడి నిర్ణయంతో డీల్ కోసం సంప్రదించిన పెద్ద బ్యానర్లు షాక్ లో ఉన్నాయంటూ ప్రచారం సాగుతోంది.
ప్రభాస్ భారతదేశంలోనే అత్యంత ప్రభావవంతమైన స్టార్ గా తనని తాను ఆవిష్కరించుకుని.. హిందీ మార్కెట్ ని తనవైపు తిప్పుకున్న సంగతి తెలిసిందే. బాహుబలి సిరీస్ తో పాటు సాహో చిత్రం బాలీవుడ్ లో సంచలన విజయాలు సాధించాయి. ఆ క్రమంలోనే బాలీవుడ్ కి చెందిన ప్రముఖ అగ్ర బ్యానర్లు ప్రభాస్ తో సినిమా చేసేందుకు ఆసక్తిని కనబరిచాయి. ఇంతకుముందే భారీగా అడ్వాన్స్ లు ముట్టజెప్పేందుకు ప్రయత్నించినా ప్రభాస్ కాదని అన్నారు.
ప్రస్తుతం డార్లింగ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నారు. వరుసగా క్రేజీ చిత్రాల్లో నటిస్తున్నాడు. సలార్- ఆదిపురుష్ 3డి సహా నాగ్ అశ్విన్ తో సైన్స్ ఫిక్షన్ చిత్రంలోనూ నటించనున్నాడు. ఆ క్రమంలోనే అతడి స్థాయిని అంచనా వేసిన చాలా బ్యానర్లు భారీ పారితోషికంతో మరోసారి ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నాయి.
ఇన్ సైడ్ సోర్స్ ప్రకారం ప్రభాస్ ఒక్కో సినిమాకి రూ.75 కోట్ల పారితోషికం వసూలు చేస్తున్నారు. దీంతో హిందీలో అగ్ర బ్యానర్లు ప్రభాస్ ను ఇంకా పెద్ద ఆఫర్ లతో ప్రలోభపెట్టాయి. కానీ ప్రభాస్ దేనికీ లొంగలేదు. యష్ రాజ్ ఫిల్మ్స్- ధర్మ ప్రొడక్షన్స్- సాజిద్ నాడియాద్ వాలా వంటి బ్యానర్లు కొన్ని రోజుల క్రితం మరోసారి ప్రభాస్ ను సంప్రదించాయని తెలుస్తోంది. ఆ మేరకు ప్రభాస్ కు సంబంధించిన సన్నిహిత వర్గాలు లీకులిచ్చాయి.
100 కోట్ల పారితోషికం ఎర వేసినా ప్రభాస్ ససేమిరా అనేశారట. ప్రస్తుతానికి వరుస చిత్రాలతో బిజీగా ఉన్నానని చెప్పి ఇతర ఆఫర్లను తిరస్కరించారని తెలిసింది. కేవలం డబ్బు కోసమే ప్రభాస్ దేనికీ అంగీకరించరు. తనకు చాలా విషయాలు నచ్చాల్సి ఉంటుంది. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు దూరంగా వెళ్లి సినిమాలు చేయడం కంటే ఇక్కడ తన అభిమానులకు ప్రాధాన్యతనిస్తూనే హిందీలో సినిమాలు చేయాలనుకుంటున్నారని తెలుస్తోంది.