Begin typing your search above and press return to search.

ప్రభాస్.. 10 నెలలు రాసిచ్చేశాడు

By:  Tupaki Desk   |   5 Nov 2015 11:30 AM GMT
ప్రభాస్.. 10 నెలలు రాసిచ్చేశాడు
X
బాహుబలి ఈ స్థాయి సినిమా అవుతుందని ముందే ఊహించాడో ఏమో కానీ.. రాజమౌళి ఒక ఏడాది డేట్లు అడిగితే మీద అపారమైన నమ్మకంతో రెండేళ్లు రాసిచ్చేశాడు అప్పట్లో ప్రభాస్. ఆ తర్వాత ఆ రెండేళ్లు కాస్తా మూడేళ్లు దాటిపోయాయి. ప్రభాస్ చేసింది మరీ పెద్ద రిస్క్ అనుకున్నారు కానీ.. ఎన్ని దశాబ్దాలు ఇండస్ట్రీలో ఉన్నా, ఎన్ని సినిమాలు చేసినా రాని గుర్తింపును ఒక్క సినిమాతో సంపాదించుకున్నాడు ప్రభాస్. ఇప్పుడిక అతడి దృష్టి బాహుబలి-2 మీద పడింది. కొన్ని నెలలుగా బాహుబలి-ది కంక్లూజన్ కోసం శ్రమిస్తున్న ప్రభాస్.. ఇంకో నెల రోజుల్లో షూటింగుకి తయారైపోతున్నాడు.

రెండో పార్టుకు సంబంధించి ఇప్పటికే 40 శాతం షూటింగ్ అయిపోయిందని చెబుతున్నప్పటికీ.. మిగతా 60 శాతం షూటింగుకి కూడా దాదాపు ఏడాది సమయం పట్టే అవకాశముంది. కేవలం షూటింగ్ డేస్ మాత్రమే 190 రోజులు ప్లాన్ చేశారట. ఆ 190 రోజులకు సంబంధించి వర్క్ షెడ్యూల్ పక్కాగా రెడీ అయింది. మధ్య మధ్యలో గ్యాప్ లు కూడా కలిపితే మొత్తంగా 10 నెలల పాటు షూటింగ్ జరిగే అవకాశాలున్నాయట. మొత్తం షూటింగులో ప్రభాస్ కు ప్రతి రోజూ పని ఉంటుంది. కాబట్టి వచ్చే పది నెలలూ ప్రభాస్ అందుబాటులో ఉండాల్సిందే. కాబట్టి 2016 అంతా దాదాపు బాహుబలి-2కే అంకితం చేయాలి. సుజీత్ తో అనుకుంటున్న సినిమా వచ్చే ఏడాది ఆఖర్లో కానీ మొదలయ్యే అవకాశాలు లేనట్లే.