Begin typing your search above and press return to search.
డార్లింగ్ పెళ్లి గురించి క్లారిటీ!
By: Tupaki Desk | 20 Aug 2019 8:15 AM GMTటాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరు అంటే ఫస్ట్ గుర్తొచ్చే పేరు డార్లింగ్ ప్రభాస్. స్టార్ గా ఎవరికి అంత ఈజీగా అందలేనంత ఎత్తుకు ఎదిగినా ఒక్క పెళ్లి విషయంలోనే ఎందుకో ఆలస్యం చేస్తున్న ప్రభాస్ ఇప్పటికీ ఆ విషయంలో వస్తున్న పుకార్లకు కూల్ గానే సమాధానం ఇస్తున్నాడు. అనుష్కతో ఆల్మోస్ట్ ఫిక్స్ అయినట్టేనని గత ఏడాది మీడియాలోని ఓ వర్గంలో పెద్ద ప్రచారమే జరిగింది. ఇద్దరూ ఖండించినప్పటికీ ఎప్పటికప్పుడు కొత్తగా పుట్టుకొస్తూనే ఉన్నాయి.
తాజాగా సాహో ప్రమోషన్స్ లో ఊపిరాడనంత బిజీగా ఉన్న ప్రభాస్ కు ఇక్కడా అదే ప్రశ్న ఎదురవుతోంది. దీనికి స్పష్టంగా బదులు ఇస్తూ అనుష్క కానీ ఇంకో అమ్మాయికానీ తన జీవితంలో అడుగు పెట్టలేదని పెళ్లి చేసుకోవాల్సి వస్తే అందరికి చెప్పే చేసుకుంటానన్న డార్లింగ్ లవ్ మ్యారేజ్ కావొచ్చని ట్విస్ట్ ఇవ్వడం విశేషం. ఇక పెదనాన్న రెబెల్ స్టార్ కృష్ణం రాజు కూడా వీటి గురించి రెస్పాండ్ అయ్యారు. ఎవరో ఎన్ఆర్ఐతో ఫిక్స్ కావొచ్చని వస్తున్న వార్తల్లో నిజం లేదని అసలు అలాంటి ఆలోచనే లేదని తగిన జోడి కోసం తమ కుటుంబం వెతుకుతూనే ఉందని స్పష్టత ఇచ్చారు.
సో ప్రభాస్ మ్యారేజ్ స్టోరీలో సస్పెన్స్ ఇంకా కొనసాగుతుందన్న మాట. గత కొన్నేళ్లుగా ఇదే టాపిక్ మీద ఎన్నో సార్లు సమాధానం చెప్పుకున్న ప్రభాస్ ఈసారైనా సాలిడ్ గా పెళ్లి చేసేసుకుని ఇదుగో నా భార్య అంటూ కొత్త లైఫ్ పార్టనర్ ని పరిచయం చేస్తే తప్ప ఇలాంటి ప్రచారాలకు బ్రేక్ పడటం జరగని పని. మరి స్వంత ఫ్యామిలీతో పాటు కోట్లాది అభిమానులు ఎదురు చూస్తున్న ఆ శుభ ఘడియలు ఎప్పుడు వస్తాయో