Begin typing your search above and press return to search.

డ్రగ్స్ కేసులో అరెస్టయిన ప్రభాస్ హీరోయిన్ సీక్రెట్ పెళ్లి..!

By:  Tupaki Desk   |   23 March 2021 2:54 PM GMT
డ్రగ్స్ కేసులో అరెస్టయిన ప్రభాస్ హీరోయిన్ సీక్రెట్ పెళ్లి..!
X
కన్నడ సీమలో వెలుగులో వచ్చిన డ్రగ్స్ రాకెట్ లో అరెస్ట్ కాబడి ఇటీవలే బెయిల్ పై బయటకు వచ్చిన హీరోయిన్ సంజన గల్రానీ.. సీక్రెట్ గా పెళ్లి చేసుకొని కొత్త జీవితంలో అడుగుపెట్టింది. ఇటీవల ఆమె వివాహానికి సంబంధించిన వార్తలను నిజం చేస్తూ కర్ణాటకకు చెందిన డాక్టర్‌ పాషాను పెళ్లి చేసుకుంది. ఈ విషయాన్ని ఆమె ధృవీకరించింది. సంజనా పెళ్లికి పరిమిత సంఖ్యలో స్నేహితులు, బంధువులు హాజరయ్యారని తెలుస్తోంది. ప్రస్తుతం సంజన వివాహానికి సంబంధించిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

ఇదిలా వుండగా ఈ మధ్య వృత్తిపరంగా వ్యక్తిగతంగా అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్న సంజనా.. డిజిటల్‌ రంగంలోకి కూడా అడుగు పెడుతుందని తెలుస్తోంది. త్వరలోనే తన డిజిటల్‌ మీడియాకు సంబంధించిన పేరు, ఇతర వివరాలను వెల్లడిస్తానని సంజనా గల్రాని తెలిపింది. ఇలా పెళ్లి చేసుకుని వ్యక్తిగతంగా కొత్త జీవితాన్ని ప్రారంభించడమే కాకుండా వృత్తిపరంగానూ కొత్త అధ్యాయానికి నాంది పలకడానికి సంజన ప్రణాళికలు వేసుకున్నట్లు తెలుస్తోంది.

కాగా, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన 'బుజ్జిగాడు' సినిమాలో సంజన సెకండ్ హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత 'యమహా యమా' 'ముగ్గురు' 'సర్ధార్ గబ్బర్ సింగ్' వంటి తెలుగు సినిమాలలో కనిపించింది. డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన తర్వాత సంజన పై అనేక ఆరోపణలు వచ్చాయి. అక్రమాస్తులు ఉన్నాయని.. డ్రగ్ దందాతో పాటు క్రికెట్ బెట్టింగ్స్ కూడా నిర్వహించేదని.. పలు రాజకీయ నాయకులకు బినామీగా కూడా ఉందని కన్నడ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. కొన్ని రోజుల జైలు జీవితం గడిపిన తర్వాత సంజన బెయిల్ పై బయటకు వచ్చింది. ఈ క్రమంలోనే జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది.