Begin typing your search above and press return to search.
అంతర్జాతీయ విలుకాడి కోసం ప్రభాస్ వేట?
By: Tupaki Desk | 23 Aug 2020 10:30 AM GMT`ఆదిపురుష్ 3డి` సన్నాహకాలు అంతకంతకు హీట్ పెంచేస్తున్నాయి. దర్శకుడు ఓం రౌత్ ఈ ప్రాజెక్టును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని పనులన్నీ చకచకా కానిచ్చేస్తున్నారు. ప్రీప్రొడక్షన్ స్వింగ్ లో ఉన్నట్టే అర్థమవుతోంది. సైఫ్ ఖాన్ ఇందులో విలన్ గా నటించనుండగా.. కీర్తి సురేష్ సీత పాత్రను పోషించనుందని కథనాలు వస్తున్నాయి. ఇక షూటింగులకు అన్నివిధాలా కేంద్ర సమాచార ప్రసారాల శాఖ నుంచి క్లియరెన్స్ రావడంతో చాలా మంది కోవిడ్ నియమాలు పాటిస్తూ షూటింగులు సాగించే వీలుంది. సెప్టెంబర్ అక్టోబర్ లో భయాన్ని వీడి ముందుకెళ్లేందుకు చాలా మంది నిర్మాతలు యోచిస్తున్నారు.
రాధేశ్యామ్ చిత్రీకరణ పూర్తయిన అనంతరం ప్రభాస్ ఓవైపు నాగ్ అశ్విన్ సినిమాని పూర్తి చేయాల్సి ఉంది. మరోవైపు ఆది పురుష్ కి సంబంధించిన ముందస్తు సన్నాహకాలు చేయనున్నారు. ఆదిపురుష్ విలుకాడు కాబట్టి ఆ విద్యలో నైపుణ్యం సంపాదించేందుకు ప్రభాస్ ప్రిపరేషన్ సాగించాల్సి ఉంది.
విలువిద్య నేర్పించాలంటే గురువు సరైన వాడే అయ్యుండాలి. తుపాకీ బుల్లెట్ పేల్చినంత ఈజీగా శరం సంధించేయలేం.. బాణం దూసుకు వెళ్లదు. దానికి ఆర్చరీలో శిక్షణ అవసరం. మరి ఎవరైనా ప్రొఫెషనల్ ఆర్చర్ వద్ద ప్రభాస్ శిక్షణ పొందుతారా? అందుకు అంతర్జాతీయంగా ఏఏ పేర్లు పరిశీలిస్తున్నారు? అన్నది చూడాలి. ఇక యోధానుయోధునిగా ప్రభాస్ గెటప్ ఎలా ఉంటుంది? అన్నది చూడాలి. మెలూహా తరహా వేషధారణతో ప్రభాస్ మ్యాజిక్ చేయబోతున్నాడా? శ్రీరాముని తరహాలో కనిపిస్తాడా? ఫిక్షన్ స్టోరీకి అసలు మూలాధారం ఏది అన్నది ఇప్పటికైతే సస్పెన్స్.