Begin typing your search above and press return to search.
'బాహుబలి' తరువాతనే విధిని నమ్మడం మొదలెట్టా!
By: Tupaki Desk | 10 March 2022 11:30 PM GMT'బాహుబలి' .. 'బాహుబలి 2' సినిమాలతో రాజమౌళి - ప్రభాస్ పేర్లు ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగాయి. ఒక టాలీవుడ్ హీరో క్రేజ్ బాలీవుడ్ స్టార్ హీరోలను దాటేసి వెళ్లడమనేది ఈ సినిమాతోనే జరిగింది. తెలుగు సినిమా చరిత్రలో ఈ సినిమాలకి సంబంధించిన పేజీలు గోల్డెన్ లెటర్స్ తో కనిపిస్తాయి.
ఈ రెండు సినిమాలు కూడా ప్రభాస్ క్రేజ్ ను అపజయాలకు అతీతంగా తీసుకుని వెళ్లాయి. అంతటి స్థాయిని ప్రభాస్ కి ఇచ్చిన రాజమౌళి, 'రాధేశ్యామ్' సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ప్రభాస్ ను ఇంటర్వ్యూ చేయడం విశేషం.
సాధారణంగా సినిమాల్లో హీరోలు జాతకాలు చెప్పేవారి పాత్రల్లో కనిపించడం చాలా అరుదనే చెప్పాలి. అలాంటి ఒక 'పామిస్ట్' పాత్రలో ప్రభాస్ చేశాడు. 'ఎవరి జీవితంలో ఏ రోజు ఏం జరుగుతుందో చెప్పగలను' అంటూనే తన పాత్రను గురించి ఈ సినిమా వీడియస్ ద్వారా ఆయన ప్రేక్షకులను చెప్పాడు. ప్రేమకీ .. విధికి మధ్య జరిగే పోరాటమే ఈ కథ. అసలు ఇంతకీ ప్రభాస్ 'విధి'ని నమ్ముతాడా? అనేదే అందరిలో ముందుగా కలిగే సందేహం.
అదే ప్రశ్నను ప్రభాస్ ను రాజమౌళి అడిగారు. అందుకు ప్రభాస్ మాట్లాడుతూ .. 'బాహుబలి' సినిమా చేయడానికి ముందు నేను కష్టాన్ని ఎక్కువగా నమ్మేవాడిని. ఆ తరువాత నుంచి 'విధి'ని కూడా నమ్మడం మొదలెట్టాను.
దేశంలో ఎంతోమంది గొప్ప గొప్ప ఆర్టిస్టులు ఉన్నారు. కానీ 'బాహుబలి' చేసే అవకాశం నాకు మాత్రమే వచ్చింది .. అదే 'విధి' అనే ఒక విషయం నాకు అర్థమైంది. 'విధి'ని నేను ముందుగానే నమ్మాల్సింది .. నమ్మడానికి కొంత సమయం పట్టింది అంతే. సత్యరాజ్ గారితో కూడా నేను ఒకసారి అన్నాను .. నేను హార్డ్ వర్క్ ను మాత్రమే నమ్ముతాను .. మిగతావి పట్టించుకోను అని.
అప్పుడు ఆయన హీరోగా నా ప్రయాణాన్ని గురించి ప్రశ్నించారు. ప్రతి సమాధానం తరువాత ఎందుకు ఇలా జరిగింది? అనే ప్రశ్న వేసుకుంటూ వెళ్లమన్నారు. అలా ఎందుకు? .. ఎందుకు? అంటూ వెళ్లిన నాకు ఇదంతా 'విధి' అనే విషయం అర్థమైంది.
విధి అనేది మన చేతుల్లో లేనిది. అది మన జీవితాలను ఎలా డిజైన్ చేస్తుందన్నది మనకే తెలియదు. మా పెదనాన్న గారి లైఫ్ లో జరిగిన కొన్ని సంఘటనలను తీసుకుంటే .. అలాగే మా ఫ్రెండ్స్ చెప్పిన వాళ్ల అనుభవాలను తీసుకుంటే విధి అనేది ఒకటి మనలను నడిపిస్తూ ఉంటుందనే విషయం తెలిసింది. ఒక సందర్భంలో కంగనా నాకు తన గురించి చెప్పారు.
తను ఒక విలేజ్ నుంచి .. సినిమాకి సంబంధం లేని ఫ్యామిలీ నుంచి వచ్చారు. ఒకసారి ఆమె కేరళ వెళ్లినప్పుడు ఎవరో తాళపత్రాలు చూసి 'నువ్వు హీరోయిన్ అవుతావు' అని చెప్పారట. ఆ సమయంలో ఆ మాటలను ఆమెనే నమ్మలేదట. కానీ ఇప్పుడు ఆమె స్టార్ హీరోయిన్ .. విధి అంటే ఇదే" అని చెప్పుకొచ్చాడు.