Begin typing your search above and press return to search.
'రాధేశ్యామ్' ప్రభాస్ వద్దకు చేరడానికి ముందు ఇంత కథ నడిచిందా..?
By: Tupaki Desk | 6 March 2022 6:30 AM GMTయంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ ''రాధేశ్యామ్'' ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. మార్చి 11న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది.
1970స్ యూరప్ బ్యాక్ డ్రాప్ లో ఒక అద్భుతమైన పీరియాడికల్ లవ్ డ్రామాగా 'రాధేశ్యామ్' చిత్రాన్ని తీర్చిదిద్దారు. దీన్ని ప్రేమకు విధికి మధ్య జరిగిన పెద్ద యుద్ధంలాగా మేకర్స్ అభివర్ణిస్తున్నారు.
అయితే ఈ కథ ప్రభాస్ చెంతకు చేరడానికి ముందు పెద్ద కథే ఉందని తెలుస్తోంది. నిజానికి రాధేశ్యామ్ స్టోరీ లైన్ డైరెక్టర్ రాధాకృష్ణది కాదు. ఆయన గురువు, విలక్షణ దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి ఆలోచనలో నుంచి వచ్చినదీ కథ.
వైవిధ్యమైన కథలు రాసుకునే చంద్రశేఖర్.. 18 ఏళ్ల క్రిందట జ్యోతిష్యం మీద ఓ లైన్ అనుకున్నారట. అప్పుడు ఆయన వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్న రాధాకృష్ణ కూడా స్క్రిప్టును డెవలప్ చేసే ప్రాసెస్ లో ఉన్నారు.
పామిస్ట్రీని మెయిన్ పాయింట్ గా అనుకుని రెడీ చేసిన కథను ముందుగా సీనియర్ హీరో వెంకటేష్ కు నెరేట్ చేశారట. అయితే వెంకీ ఈ స్క్రిప్ట్ సెకండాఫ్ మీద.. కన్క్లూజన్ పై కాస్త అసంతృప్తిని వ్యక్తం చేశారట.
అయితే ఆ తర్వాత ఇండియాలో చాలా మంది పెద్ద పెద్ద రచయితలతో కూర్చొని చర్చించినా.. ఈ స్టోరీని ఎండ్ చేసే కన్క్లూజన్ దొరకలేదట. దీంతో ఇది వర్క్ ఔట్ అవదని దర్శకుడు చంద్రశేఖర్ ఆ కథను పక్కన పెట్టేసారట.
'జిల్' చిత్రంతో దర్శకుడిగా మారిన రాధాకృష్ణ.. యూవీ క్రియేషన్స్ లో మరో సినిమా చేయాల్సి వచ్చినప్పుడు.. అప్పుడు తన గురువు వదిలేసిన లైన్ ను తెర మీదకు తీసుకురావాలని భావించారు.
ఇదే విషయాన్ని చంద్రశేఖర్ ఏలేటికి చెప్పిన రాధా.. ఆ ఐడియా తీసుకొని డిఫరెంట్ అప్రోచ్ తో స్క్రిప్టు రాయడం మొదలు పెట్టారు. దీనికి పామిస్ట్రీతో పాటుగా లవ్ స్టొరీని జత చేయడమే కాదు.. కన్ క్లూజన్ ను కూడా ఇచ్చారు.
రాధాకృష్ణ సైతం ఈ స్క్రిప్టు మీద ఆరేడు నెలలు ట్రావెల్ చేసిన తర్వాత టైం వేస్ట్ చేస్తున్నానేమో అని అనుకున్నారట. అయితే సడన్ గా మ్యాజిక్ క్రియేట్ అయినట్లు ఐడియా రావడంతో కథ రెడీ అయిందని ఇటీవల దర్శకుడు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
ఈ క్రమంలో పూర్తి కథను ప్రభాస్ కు చెప్పడంతో సింగిల్ సిట్టింగ్ లోనే ఓకే చేసారని తెలుస్తోంది. దీంతో 18 ఏళ్లుగా పక్కన పెట్టబడిన లైన్ పాన్ ఇండియా సినిమాగా రూపుదిద్దుకుంది. ఎక్కడో పుట్టిన కథ.. ఇంకెక్కడికో వెళ్లి.. చివరకు మరెక్కడికో చేరుతుందనడానికి 'రాధేశ్యామ్' ను ఉదాహరణగా చెప్పవచ్చు.
ఇందులో విక్రమాదిత్య అనే హస్తసముద్రికా నిపుణుడిగా ప్రభాస్.. ప్రేరణగా హీరోయిన్ పూజా హెగ్డే కనిపించనున్నారు. కృష్ణంరాజు - భాగ్యశ్రీ - జగపతిబాబు - ప్రియదర్శి - మురళీ శర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
గోపీ కృష్ణ మూవీస్ - టీ సిరీస్ సహకారంతో యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ - ప్రమోద్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ చైనీస్ మరియు జపనీస్ భాషల్లో ''రాధేశ్యామ్'' సినిమా విడుదల కానుంది.