Begin typing your search above and press return to search.

టాప్ 10 లో సౌత్ నుండి ప్రభాస్ ఒక్కడే

By:  Tupaki Desk   |   2 Aug 2021 4:21 AM GMT
టాప్ 10 లో సౌత్ నుండి ప్రభాస్ ఒక్కడే
X
యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ పాన్ ఇండియా సూపర్‌ స్టార్‌ అనడంలో సందేహం లేదు. ఆయన బాహుబలి రెండు పార్ట్‌ లు ఆ తర్వాత వచ్చిన సాహో సినిమాలతో బాలీవుడ్ లో సముచిత స్థానంను దక్కించుకున్నాడు. భారీ ఎత్తున అంచనాలున్న పలు సినిమాలను ప్రభాస్ చేస్తున్నాడు. బాలీవుడ్‌ లో కూడా డైరెక్ట్‌ సినిమాలను వరుసగా ప్రభాస్ చేస్తున్నాడు. ఆదిపురుష్‌ తో ప్రభాస్‌ బాలీవుడ్‌ లో మరింత స్టార్‌ డమ్‌ దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. సౌత్ నుండి బాలీవుడ్‌ లో అత్యధిక క్రేజ్ ఉన్న స్టార్‌ ఎవరు అంటే నిస్సందేహంగా ప్రభాస్ అనే సమాధానం వినిపిస్తుంది. ఫేస్ బుక్‌ ఫాలోవర్స్ సంఖ్య ఆ విషయాన్ని చెప్పకనే చెబుతోంది. ప్రభాస్ ఫేస్ బుక్ లో 24 మిలియన్‌ ల ఫాలోవర్స్ ఉన్నారు.

ఇండియన్ స్టార్‌ హీరోల్లో ఫేస్‌ బుక్‌ లో అత్యధిక ఫాలోవర్స్‌ ను కలిగి ఉన్న స్టార్స్‌ టాప్ 10 జాబితాలో యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ చోటు దక్కించుకున్నాడు. నెం.1 స్థానంలో సల్మాన్ ఖాన్‌ ఉన్నాడు. ఆయన్ను ఫేస్ బుక్ లో ఏకంగా 50.7 మిలియన్ ల మంది ఫాలో అవుతున్నారు. రెండవ స్థానంలో అక్షయ్‌ కుమార్ ఉన్నాడు. మూడవ స్థానంలో బాలీవుడ్‌ బాద్‌ షా షారుఖ్‌ ఖాన్‌ నిలచాడు. ఆ తర్వాత అమితాబచ్చన్‌.. కపిల్‌ శర్మ.. హృతిక్ రోషన్‌.. టైగర్‌ ష్రాఫ్‌ అజయ్‌ దేవగన్‌ లు ఉన్నారు. మన ప్రభాస్ కు ఈ జాబితాలో 9వ స్థానం దక్కింది. అజయ్ దేవగన్ మరియు ప్రభాస్‌ ల మద్య వ్యత్యాసం చాలా తక్కువే ఉంది. అతి త్వరలోనే ప్రభాస్ ఈ జాబితాలో మరింత పైకి ఎగబాకే అవకాశం ఉంది. నెం.10 స్థానంలో బాలీవుడ్‌ యంగ్‌ స్టార్‌ షాహిద్‌ కపూర్‌ ఉన్నాడు.

బాలీవుడ్‌ స్టార్స్ తో పోటీ పడి మరీ ప్రభాస్ ఈ జాబితాలో 9వ స్థానంలో నిలవడం జరిగింది. టాప్‌ 10 లో సౌత్‌ ఇండియన్‌ స్టార్‌ హీరోల్లో ఏ ఒక్కరికి కూడా చోటు లేదు. భారీ ఎత్తున అంచనాలున్న సినిమాలను చేయడంతో పాటు అక్కడ ప్రభాస్‌ నటించిన సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకుంటున్న నేపథ్యంలో ప్రభాస్‌ కు ఏకంగా టాప్ 10 లో చోటు దక్కింది. ఇన్‌ స్టా గ్రామ్‌ లో కూడా పెద్ద ఎత్తున ప్రభాస్‌ కు ఫాలోవర్స్ ఉన్నారు. సోషల్‌ మీడియాలో బాలీవుడ్‌ స్టార్స్ తో పోల్చితే సౌత్‌ స్టార్స్‌ సందడి కాస్త తక్కువగానే ఉంటుంది. కాని ఈమద్య కాలంలో బాలీవుడ్‌ టాప్ స్టార్స్‌ తో పోటీ పడేందుకు ప్రభాస్ చాలా సీరియస్ గా ప్రయత్నాలు చేస్తున్నాడు.

ఇక ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే రాధే శ్యామ్‌ ఇటీవలే షూటింగ్‌ ను పూర్తి చేసుకుంది. ఆ సినిమాను సంక్రాంతికి విడుదల చేయబోతున్నబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది. రాధే శ్యామ్‌ లో హీరోయిన్ గా పూజా హెగ్డే నటించగా రాధాకృష్ణ దర్శకత్వం వహించాడు. మరో వైపు కేజీఎఫ్‌ దర్శకుడు ప్రశాంత్‌ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ సలార్‌ సినిమాను చేస్తున్నాడు. శృతి హాసన్‌ ఆ సినిమాలో హీరోయిన్‌ గా నటిస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమా ను కూడా వచ్చే ఏడాది ఆరంభంలోనే విడుదల చేయాలని భావిస్తున్నారు. ఇక మోస్ట్‌ అవైటెడ్‌ మూవీ ఆదిపురుష్‌ షూటింగ్ కూడా ఇప్పటికే మొదలైంది. వచ్చే ఏడాది ఆగస్టులో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ప్రాజెక్ట్‌ కే సినిమా ఇటీవలే పట్టాలెక్కింది. సినిమాకు సంబంధించిన అప్డేట్‌ అతి త్వరలో రాబోతుంది. 2023లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.