Begin typing your search above and press return to search.

'అందుకే నాకు ఇంకా పెళ్లి కాలేదు'.. ప్రభాస్ షాకింగ్ కామెంట్స్..!

By:  Tupaki Desk   |   2 March 2022 1:38 PM GMT
అందుకే నాకు ఇంకా పెళ్లి కాలేదు.. ప్రభాస్ షాకింగ్ కామెంట్స్..!
X
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన పీరియాడికల్‌ లవ్ డ్రామా 'రాధేశ్యామ్‌' ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయింది 2022 మార్చి 11న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ శరవేగంగా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం ముంబయిలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభాస్ తన పెళ్లిపై ఫన్నీగా స్పందించారు.

'రాధేశ్యామ్' సినిమాకి కర్టెన్‌ రైజర్‌ గా లేటెస్టుగా విడుదల చేసిన కొత్త ట్రైలర్‌ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. సినిమాలో లవ్ స్టొరీకి మించి ఏదో విషయం ఉంటుందనే ఆసక్తి కలిగించింది. దీంతో ఒక్కసారిగా అంచనాలు మరింతగా పెరిగాయి. ఇందులో 'ప్రేమ విషయంలో ఆదిత్య ప్రిడిక్షన్ తప్పు' అని చెప్పే డైలాగ్ అందరినీ ఆకర్షించింది.

'రాధేశ్యామ్' రిలీజ్ ట్రైలర్ లాంచ్ సందర్భంగా మీడియా మిత్రులు ప్రభాస్ వద్ద దీని గురించి ప్రస్తావించారు. రియల్ లైఫ్ లో ప్రేమ విషయంలో ఎన్ని సార్లు మీ ప్రిడిక్షన్‌ తప్పింది? అని డార్లింగ్ ను ప్రశ్నించగా.. ''చాలా సార్లు జరిగింది.. అందుకే నాకు ఇంకా పెళ్లి కాలేదు అనుకుంటా'' అని నవ్వుతూ బదులిచ్చారు.

ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా పిలవబడే ప్రభాస్ తన పెళ్లి గురించి కామెంట్ చేయడంతో అక్కడ అందరూ ఒక్కసారిగా నవ్వేశారు. బాలీవుడ్‌ లో అమితాబ్‌ బచ్చన్ తనకు ఇన్‌స్పీరేషన్‌ అని.. సల్మాన్ ఖాన్ - షారూఖ్‌ ఖాన్ లన్నా ఇష్టమేనని ప్రభాస్‌ తెలిపారు.

ప్రభాస్‌ గురించి హీరోయిన్ పూజా హెగ్డే మాట్లాడుతూ.. అందరూ ఆయన్ను చాలా షై పర్సన్‌ అంటుంటారని.. కానీ తను చాలా జోవియల్‌ పర్సన్‌ అని.. సెట్‌ లో సరదాగా ఉంటారని తెలిపింది. ఈ ఈవెంట్ లో ప్రభాస్‌ - పూజాహెగ్డేలతో పాటుగా దర్శకుడు రాధా కృష్ణ కుమార్‌ - యూవీ నిర్మాత వంశీ - టీ సిరీస్ భూషణ్‌ కుమార్‌ పాల్గొన్నారు.